దళిత బంధు.. ఇచ్చినట్టే ఇచ్చి.. కెసిఆర్ మళ్లీ గుంజుకుంటాడా?

praveen
మరికొన్ని రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న ప్రతి పని కూడా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం మారిపోతుంది.  తనకు కసవాలు విసిరిన ఈటలను ఓడించడమే లక్ష్యంగా కెసిఆర్ ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నారు.  ఇక ప్రభుత్వం చేతుల్లో ఉండటంతో భారీగా ఖర్చు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాలను కూడా ఆలోచించడం లేదు కేసీఆర్.  ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్షాలకు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఉన్న అప్పుల చిట్టాను ఇక ఇప్పుడు ఏడేళ్ల టిఆర్ఎస్ పాలనలో అప్పుల చిట్టాను చూపిస్తూ కెసిఆర్ పాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన కెసిఆర్..  ఇటీవలే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకం ప్రకటించడం సంచలనం గానే మారిపోయింది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దళితులకు 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్.

 ఇక దళిత బందు నేపథ్యంలో అటు రాష్ట్రం మొత్తం మరింత అప్పుల ఊబిలో కూరుకు పోతుంది అనే చెప్పాలి. అయితే మరికొంతమంది దళిత బంద్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు మీద 10 లక్షలు ఇస్తున్నాం అని ప్రజలకు చెబుతున్నారు. ఇలా  ఇప్పుడు దళితులకు 1000000 పంచుతున్నాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్..  దళితుల తోపాటు రాష్ట్ర ప్రజలందరికీ పట్టిపీడించే విధంగా అన్నింటిపై పన్నులు పెంచి మళ్లీ అంతకంతకు వసూలు చేస్తాడు అని అంటున్నారు విశ్లేషకులు . ఇలా దళిత బంధు రూపంలో 10 లక్షలు ఇచ్చి మళ్లీ పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చటం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: