కెసిఆర్ ప్లాన్.. పూర్తిగా బెడిసి కొడుతుందే?

praveen
కెసిఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఒక సంచలనం అనే చెప్పాలి..  కేవలం ఒక ఉప ఎన్నిక కోసమే దళిత బందు పథకాన్ని తీసుకు వచ్చాను అంటూ మీడియా వేదికగా ప్రకటించడం మరో సంచలనం.  అయితే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఒక పథకం ద్వారా ప్రజలకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించింది లేదు.  అలాంటిది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దీన పరిస్థితుల్లో ఉన్న సమయంలో అటు కె.సి.ఆర్ ఒక ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏకంగా పది లక్షల రూపాయలకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టడం సంచలనం గానే  మారిపోయింది.

 అటు దళితులకు దళిత బందు అనే పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తే ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది అని  కెసిఆర్ అనుకున్నారు . ఇంత పెద్ద పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఇక టిఆర్ఎస్ కు తిరుగు ఏముంటుంది అని అనుకున్నాడు కేసీఆర్. కానీ  ఇటీవల కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం బెడిసికొడుతున్నట్లు తెలుస్తోంది.  దళిత బంధు పథకం ద్వారా కెసిఆర్ పై దళితుల్లోనే వ్యతిరేకత వస్తుంది. ఇక మిగితా కులాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు .  కేవలం రాష్ట్రంలో దళితులు మాత్రమే ఉన్నారా..  మిగతా వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా.. మాకు కూడా బిసి బంధు ప్రకటించండి అంటూ ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు.

 లేదంటే వచ్చే ఎలక్షన్లలో మా దగ్గరికి వచ్చి ఎలా ఓట్లు అడుగుతారో మేము కూడా చూస్తాం అటు వార్నింగ్ లు సైతం ఇస్తున్నారు . ఇలాంటి సమయంలో అటు దళితుల్లో కూడా దళిత బంధు పథకం పై వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వరుసగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం ఐదు నియోజకవర్గాల పేర్లు మాత్రమే చెప్పారు. దీంతో ఇక ఇతర జిల్లాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.  కేవలం కరీంనగర్లో ఉన్న దళితులు మాత్రమే మీకు కనిపిస్తున్న కేసీఆర్ సార్.. మేము కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా కేసీఆర్ తీసుకొచ్చిన పథకమే ప్రస్తుతం బెడిసి కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: