టిటిడి పాలక మండలి సభ్యులు తుది జాబితా ఫైనల్,, ఇదే లిస్ట్ ?

Veldandi Saikiran
టిటిడి పాలక మండలి సభ్యులు తుది జాబితా ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే మొదటి విడతలో పాలకమండలి సభ్యుల జాబితాను విడుదల చేసే ఆలో చన లో ఉంది జగన్ ప్రభుత్వం.  ఇక రెండవ విడత లో ప్రత్యేక ఆహ్వనితుల జాబితా విడుదల చేసే దిశగా అడుగులు వేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇక  టిటిడి పాలక మండలి సభ్యులు తుది జాబితా వివరాల్లోకి వస్తే.. పాలక మండలి సభ్యులు గా అంధ ప్రదేశ్ రాష్ట్రం నుంచి  పోకల అశోక్ కుమార్, మ ల్లాడి క్రిష్ణా రావు, వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబు రావు, మధు సూదన్ యాదవ్ లకు చోటు దక్కినట్లు సమాచారం అందుతోంది. 

అలాగే తెలంగాణ రాష్ట్రం  నుంచి రామేశ్వరావు, లక్ష్మినారాయణ, పార్దసారధి రెడ్డి, మూరం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  అంతేకాదు తమిళనాడు రాష్ట్రం  నుంచి శ్రీనివాసన్, ఎమ్మేల్యే నందకుమార్, కన్నయ్య ఉండగా కర్నాటక రాష్ట్రం  నుంచి శశిధర్,ఎమ్మల్యే విశ్వనాధ్ రెడ్డి చోటు దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది.  మహరాష్ర్టా నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్ కు ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.  అయితే తమిళనాడు కు చెందిన కన్నయ్య పై అనేక రక మైన అభియోగాలు రావడం గమనార్హం.  

2018 లోనే పిఎంఓ ఆదేశాలు మేరకు కన్నయ్య పై సిబిఐ విచారణ కోరిన రైల్వే విజిలేన్స్ శాఖ..  1500 కోట్ల అక్రమ ఆస్తులు కన్నయ్య కలిగి వున్నట్లు అభియోగాలు ఉన్నాయి.  కన్నయ్య చైర్మన్ గా వున్న రైల్వే సోసైటికి సంబంధించి మరో 108 కేసులు పెండింగ్ లో వున్నట్ల సమాచారం అందుతోంది.  అయినప్పటికీ కన్నయని పాలకమండలి సభ్యులుగా సిఫార్సు చేశారు తమిళనాడు సిఎం స్టాలిన్. ఈ నేపథ్యం లోనే ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: