కేసీఆర్ సారూ .. ఖజానా ఖాళీ అంటావ్ .. 10లచ్చలు ఎట్లిస్తున్నావ్ ..

Chandrasekhar Reddy
హుజురాబాద్ ఉపఎన్నిక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనితో ఆప్రాంతంలో దళిత వర్గాలను ఆకర్షించేందుకు భారీ పధకాన్ని తెరపైకి తెచ్చారు. అదే దళితబందు, ఈ పథకం కింద ఉపఎన్నిక జరిగే ప్రాంతంలో ఉన్న దాదాపు 20929 కుటుంబాల నుండి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి పదిలక్షల చొప్పున అందజేయనున్నారు. దీనితో పాటుగా వీరికోసం రక్షణ నిధి  ఏర్పాటు చేయనున్నారు. దీనిద్వారా ఆయా కుటుంబాలలో ఎవరికైన అనుకోని ప్రమాదానికి గురిఅయినప్పుడు ఉపకరించనుంది. అయితే ఈ పథకం హుజురాబాద్ లో ప్రారంభించి త్వరలో పూర్తి తెలంగాణాలో విస్తరించనున్నారు. ఒకపక్క ఖజానాలో చిల్లిగవ్వ లేదు, అందుకే అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నాం అని చెప్పుకొస్తున్న సీఎం కేసీఆర్ ఈ పథకానికి మాత్రం నగదు ఎక్కడ నుండి తెస్తున్నట్టు అంటూ విపక్షాలు గొల్లుమంటున్నాయి.
బీజేపీ చాలా నాటకీయంగా హుజురాబాద్ సీటును ఖాళీ చేయించి, మరో ఉపఎన్నిక తెరపైకి తెచ్చి మరో సీటు తన ఖాతాలో వేసుకోవాలి అనుకుంది. కానీ, ఈసారి కేసీఆర్ మెలుకువగా ఉండటంతో వారి పథకం బెడిసికొట్టినట్టే ఉంది. ఇక కేసీఆర్ కూడా బీజేపీ పధకాన్ని కనిపెట్టినవాడై దానికి తగ్గ ప్రణాళికలు వేసి తదనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అలా పుట్టిందే దళితబందు. కానీ ఈ రచనకు మరియు అమలుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి ఎన్నిక వాయిదా పడింది. ఈ విషయం బీజేపీ కూడా గ్రహించింది అందుకే ముందస్తు ప్రచారం ప్రారంభించింది.
సాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్కడ కొత్త పథకాలు అమలుకు సాధ్యం కానిపని. అందుకే వాయిదా అవసరం అయ్యింది, సమయానికి పండగ ఉండటం కేసీఆర్ కి కలిసివచ్చింది. ఇంకోరకంగా ఆలోచిస్తే దీనిని దళితబందు అనడం కంటే అక్కడ ఉన్న అత్యధిక వ్యతిరేక వర్గాన్ని తనవైపు తిప్పుకోడానికి ఎన్నికలకు ముందే ఆయా ఓట్లు కొనే పథకం అనాలి. ఇది ఈమధ్య రాజకీయాలలో సహజం అయిపోయింది. గతంలో ఎన్నిక రోజు ఓట్లు కొంటారు, ఇప్పుడు కాస్త ముందే పథకం అనే పేరు చెప్పి ఓట్లు కొనేస్తున్నారు. లేకపోతే ఇంత హఠాత్తుగా కేసీఆర్ కు దళిత ప్రేమ కలగడం వెనుక మరో కారణం ఉంటుందా .. అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: