సారీ.. పొరపాటున ట్వీట్ చేశా..? సైదాబాద్ నిందితుడు దొరకలేదన్న కేటీఆర్ !

Veldandi Saikiran
సైబరాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం మరియు హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో వేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం రోజులు అయినా.. నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ఇక ఈ అత్యాచార ఘటన పై... రాజకీయ నాయకులు మరియు సినీ తారలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి తమ వంతు సంతాపం తెలుపుతున్నారు.  ఇక అటు నిందితుడి కోసం  పోలీసులు... ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు వంద మంది పోలీసులు ఆ నిందితుని కోసం... రాత్రి పగలు కష్టపడుతున్నారు. 

నిందితుడు ఎంత వెతికినా దొరకక పోవడం తో... పోలీసులు రివార్డు ఇస్తామని నిన్న ప్రకటించారు. నిందితుడు రాజు ఆచూకి చెప్పినవారికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నిన్న ప్రకటించేశారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ  సైదాబాద్ బాలిక ఘటన లో నిందితుడు దొరికినట్లు మొన్న... మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. తప్పుడు సమాచారం మేరకే తప్పుడు ట్విట్ చేశానంటూ...  ఆవేదన వ్యక్తం చేశారు  మంత్రి కేటీఆర్. 

సమాచార లోపం తో... నిందితుడు పోలీసులకు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా ఫీడ్ చేసినట్లు విచారం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఇక ఆ ట్వీట్ ను సరి చేస్తూ... సైబాబాద్ ఆరేళ్ల బాలిక పై అత్యాచార నిందితుడి కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు చేస్తున్నట్టు స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.  అంతే కాదు.. ఆ దుర్మార్గుడు దొరికే ఎవరు... అందరూ సహకరించాలని అని కోరారు మంత్రి కేటీఆర్. ఎవరికైనా ఆ నిందితుడి ఆచూకీ దొరికితే.. తెలపాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు త్వరగా దొరికి తే.. కఠిన శిక్షలు పడతాయని... తద్వారా బాధిత కుటుంబానికి సరైన న్యాయం జరుగుతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: