రేవంత్ టాక్స్ : కాంగ్రెస్ వ్యూహ క‌ర్త తెలంగాణ క‌ట్ట‌ప్ప !

RATNA KISHORE

రేసు మొద‌ల‌య్యే స‌మ‌యానికి కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తాయి అన్న‌ది రాజ‌కీయంలో తెలిసిన స‌త్యం. ఇప్పుడు ఇంటి పార్టీపై రాళ్లు విస‌ర‌డం నేర్చుకుంటున్న నేత‌ల‌కు సొంత ఇంటి క‌ష్టాలు కూడా ప‌ట్టింపులో ఉండాలి. కానీ అవి లేకుండా ప‌క్కింటిపై రాళ్లు రువ్వ‌డంలో అర్థం లేదు. ఈ ద‌శ‌లో కొన్ని శ‌క్తుల ఏకీక‌ర‌ణ‌తో రాజ్యం సాధించాల‌ని, రాజ్యాధికారం ద‌క్కించుకోవాల‌ని త‌ప‌న ప‌డు తున్న టీపీసీసీకి కొన్ని ఆలోచ‌న‌లు ఉన్నాయి. అవి ద‌ళితుల ఓట్ల‌ను ర‌ప్పించేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయో లేదో అన్న‌ది వేచి చూడాలి.


రేవంత్ రెడ్డి సొంతంగా కొన్ని ప‌నులు చేయాలని అనుకుంటున్నారు. త‌ద్వారా కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచాల‌ని యోచిస్తున్నారు. వాస్త‌వానికి మొద‌టి నుంచి కాంగ్రెస్ కు అండ‌గా ఉన్న ద‌ళితులు ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ ఇంటి పార్టీ వైపు మొగ్గు చూపుతు న్నారంటే అందుకు బ‌ల‌మైన కార‌ణం ద‌ళిత బంధు ప‌థ‌కం. కేసీఆర్ స్థాయిలో కేసీఆర్ కు స‌మ ఉజ్జీగా నిలిచే నాయ‌కుడిగా రేవంత్ రావాల‌ని, కావాల‌ని కోరుకోవ‌డంలో త‌ప్పేం లేదు. అయితే తెలంగాణను, ఇక్క‌డి ప్ర‌జల ఆత్మ గౌర‌వ నినాదాల‌ను అర్థం చేసుకునే స్థాయిలో రేవంత్ ఉన్నారా లేదా అన్న‌ది ఓ పెద్ద డౌట్. అందుకే ఆయ‌న స్థానంతో జ‌త‌గా మ‌రో లీడ‌ర్ కూడా తెర‌పైకి వ‌స్తే బాగుం టుంద‌న్న యోచ‌న ఉంది. మాస్ లీడ‌ర్ గా ఉన్న వారే ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌ల‌రు అన్న‌ది ఇప్ప‌టికే నిరూప‌ణ అయింది క‌నుక త్వ రలోనే ఇందుకు సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న రావొచ్చు.



తెలంగాణ వాకిట కాంగ్రెస్ ను బ‌ల‌ప‌ర్చాల‌ని బీఎస్పీ భావిస్తుందా? దేశ రాజ‌కీయాల్లో  పొత్తుల‌పై ఎటువంటి స‌మాధానం రాకున్నా రాష్ట్రాలలో మాత్రం ఎవ‌రికి వారు కొన్ని ఈక్వేష‌న్లు రాసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పావులు క‌దుపుతున్నారు. ము ఖ్యంగా రేవంత్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ పీసీసీ ఎక్కువ‌గా పొత్తుల‌పై దృష్టి సారించడం విశేషం. కేసీఆర్ ను ఢీ కొనాల‌న్న ఆస‌క్తి ఎక్కు వగా ఉన్న నాయ‌కులంతా ఇప్ప‌టి నుంచే త‌మ‌దైన పావులు క‌దుపుతున్నారు. ముందుకు క‌దులుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న కారు కు బ్రేకులు వేయాల‌ని, అందుకు త‌గ్గ ప్ర‌త్యామ్నాయం వెత‌కాల‌ని కూడా రేవంత్ భావిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ (మాజీ ఐపీఎస్) సాయంతో ఇందుకు త‌గ్గ ప్ర‌ణాళిక‌లు రాస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: