జ‌య‌హో ద‌ళిత బంధు : కేసీఆర్ అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారా?

RATNA KISHORE
ద‌ళిత బంధు కార‌ణంగా త‌మ జీవితాలు మారిపోతాయి అని భావించిన లబ్ధిదారుల‌కు ఆఖ‌రుకు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి. దేశంలో ఏ సీఎం చేయని విధంగా జ‌గ‌న్ కూడా చేయ‌ని విధంగా ప‌థ‌కం అమ‌లుపై ఆంక్ష‌లు విధించి సీఎం కేసీఆర్ స‌ర్ మంచిపేరు తెచ్చుకుంటున్నారు. ప‌థ‌కం ఎందుకు? ఎలా వాడాలి ? త‌మ‌కు మంజూరు అయిన నిధులు ఎందుకు వెచ్చించాలి?  అన్న‌వి ల‌బ్ధిదారుల‌కు తెలియ‌కుండా ప‌థ‌కం అమ‌లు చేయ‌డం అస్స‌లు మంచిది కాద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే క‌లెక్ట‌ర్లతో సంబంధిత అధికారుల‌తో ప్ర‌తిరోజూ ఏదో ఒక‌టి చెబుతూనే ఉన్నారు. మానిట‌రింగ్ లేకుండా ప‌థ‌కం అమ‌లు చేయ‌డం అన్న‌ది త‌ప్పు అని కేసీఆర్ ఉద్దేశం. ఉపాధినివ్వ‌ని యూనిట్ల‌ను నెల‌కొల్పి ఏం సాధిస్తారు అని క‌లెక్ట‌ర్ ల‌బ్ధిదారుల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని స‌మాచారం.




ద‌ళిత బంధు ప‌థ‌కం పై దేశం యావ‌త్తూ ఆస‌క్తిక‌రంగా చూస్తోంది. ఈ ప‌థ‌కం అమ‌లులో కేసీఆర్ అనుస‌రిస్తున్న విధానాలు మాత్రం అత్యంత ఆస‌క్తిదాయ‌కంగానే ఉంటున్నాయి. విప‌క్షాలు ఎన్ని ఆరోప‌ణ‌లు చేసినా, వాటిని ప‌ట్టించుకోకుండా కేసీఆర్ త‌నదైన పంథా లో దూసుకుపోతున్నారు. ఎన్న‌డూ లేని విధంగా అధికారుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. దీంతో తెలంగాణ‌లో ఎటువైపు చూసినా ఈ ప‌థ‌కానికి సంబంధించి చ‌ర్చే న‌డుస్తుంది. ముఖ్యంగా హుజురాబాద్ లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించిన ఈ ప‌థ‌కం అమ‌లుపై ఎన్నో సందేహాలు తొలి రోజుల్లో వెన్నాడాయి. వాటికి కొన‌సాగింపుగా విప‌క్షాల ఆరోప‌ణ‌లు తోడ‌య్యాయి.




ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా కేసీఆర్ అనుకున్న విధంగా ముందుగా నిర్ణ‌యించిన నిబంధ‌న‌ల అనుసారం అర్హుల ఎంపిక ను పూర్తిచేసి అధికారులు సంబంధిత జాబితాల‌ను సీఎంఓకు పంపారు. మొత్తం 24000 మందిని అర్హులుగా తేల్చార‌ని స‌మాచారం. వీరికి ఒక్కో అకౌంట్ కు ప‌ది ల‌క్ష‌ల చొప్పున నిధులు ఇవ్వాల‌ని సీఎం సంక‌ల్పించారు. తొలి విడ‌తగా 13వేలు మందికి నిధులు అందించేం దుకు నిర్ణ‌యించి సంబంధిత అకౌంట్ల‌కు బ‌దిలీ చేశారు. కానీ ఈ నిధులు వినియోగంలోనే అస‌లు మ‌త‌ల‌బు ఉందని త‌రువాత తేలిపోయింది. నిధుల‌ను ఖ‌ర్చు చేసేందుకు వీల్లేద‌ని, అకౌంట్ల‌ను ఫ్రీజ్ చేశారు కలెక్ట‌ర్. త‌మ ఆదేశాలు లేనిదే బ్యాంక‌ర్లు ల‌బ్ధిదారుల‌కు నిధులు ఇవ్వ‌కూడద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: