బీజేపీకి షాక్.. కీలక నేత కాంగ్రెస్ గూటికి..!

MOHAN BABU
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి  ఊహించని రీతిలో దూసుకుపోతున్నాడు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండే ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను, జూనియర్లను ఒకే తాటి పైకి తెస్తూ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తున్నాడు. పార్టీ వ్యతిరేకులను కలుపుకోవడం లో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రేవంత్ చొరవతో కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలోకి చేరిన వారు తిరిగి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి కాంగ్రెస్  పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణలో అధికారం చేపట్టా లన్న సంకల్పంతో, పాదయాత్రలు, బహిరంగ సభల ఏర్పా టుతో దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీకి హైద రాబాద్ నగరంలో ఊహించని  షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న కొలను హనుమంత రెడ్డి బిజెపికి రాజీనామా చేశాడు. ఆదివారం  నాయకులు, కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులతో కలిసి నిర్వహించిన సమావేశంలో  తన రాజీనామా విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా హనుమంత రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీలో తనకు,కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోగా, అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుంచి రాష్ట్రంలో బీజేపీ  అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కొందరు వ్యక్తులు తనను, తన కార్యకర్తలను నిత్యం అనుమానిస్తూ, కించపరిచారని పేర్కొన్నారు.

అవమానాలను భరించలేకే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన అభిమానుల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 17న గజ్వేల్ లో నిర్వహించనున్న  సభలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు హనుమంత రెడ్డి తెలిపారు. బిజెపి, టిఆర్ఎస్ రెండూ ఒకటేనని వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: