బండి సంజయ్ రాజీనామా...? మోడీ వద్దే రాజీనామా సమర్పణ...?

Gullapally Rajesh
తెలంగాణాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మధ్య కాలంలో ఘాటు వ్యాఖ్యలు చేయడం తరుచుగా మనం చూస్తున్నాం. మంత్రి కేటిఆర్ చేసిన రాజీనామా సవాల్ కు బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ తుపాకీ రాముడు... అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు అని ఎద్దేవా చేసారు. యుపిఏ హయంలో పనుల్లో రాష్ట్రానికి 32 శాతం నిధులిస్తే .. ఎన్డీయే వచ్చాక 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నాం అని ఆయన గుర్తు చేసారు. కేటిఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని ఎద్దేవా చేసారు.
కేసీఆర్ వస్తే ఇద్దరు మోడీ దగ్గరకు వెళ్ళి రాజీనామా చేస్తాము అని సవాల్ చేసారు.  కేటిఆర్ ను ఎవరు పట్టించుకుంటారు.. కేసీఆర్ రాజీనామా చేయాలి అన్నారు ఆయన. పన్నులు విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టము ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్లు లీకులు ఇస్తున్నారు అని అన్నారు. సకల జనులు సమ్మె వలన వచ్చిన తెలంగాణ లో ముఖ్యమంత్రి కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించిందిఅని ఆయన ఆరోపణలు చేసారు.
కొత్త సెక్రటరేరియట్ పూర్తి అయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదు అని ఆయన జోస్యం చెప్పారు. సచివాలయం కి వెళ్లని వాడికి కొత్తది ఎందుకు అని నిలదీశారు. ఉద్యోగి చనిపోయిన తర్వాత పదవి విరమణ  తర్వాత పీ ఆర్ సీ ఇస్తారా? దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దిగ జారి మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలి అని ఆయన సూచించారు. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించాడు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయం లో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి కి ముఖ్య మంత్రి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: