రేవంత్ రెడ్డి సీక్రెట్ స‌ర్వే.. ప్ర‌జాప‌ల్స్ ఏమంటుంది..?

Paloji Vinay
పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్ గ‌తం కంటే స్పీడును పెంచారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొవ‌డంతో ఫైర్ బ్రాండ్‌ల‌లో రేవంత్ రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీతో పాటు సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సందిస్తూనే ఉంటారు. తాజాగా ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరాతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు నిర్ణ‌యించారు. ఆ దిశ‌గా స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన త‌రువాత ప్ర‌జ‌ల నాడీ ఏ విధంగా ఉంది. ప్ర‌జ‌ల‌కు ఎలా ద‌గ్గ‌ర కావాల‌ని చాలా సీరియ‌స్‌గా సీక్రెట్ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే రాజ‌కీయంగా ఎలా ఉంద‌నేది త‌న సొంత టీమ్‌తో స‌ర్వే చేప‌ట్టిన‌ట్టు కాంగ్రెస్ పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

   రాజకీయాల్లో రాణించ‌డం ఒక ఎత్త‌యితే, ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తీసుకురావడం చాలా ప్ర‌యాసాతో కూడుకున్న ప‌ని. అయితే, రేవంత్  కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత గ‌రిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరాతో స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఆ దిశ‌గా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌జ‌లు ఏం ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ఏ విష‌యంలో ఫెయిల్ అయింది.


అలాగే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఏ ర‌కంగా ఉండాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. అనే త‌దితర అంశాల‌పై రేవంత్ రెడ్డి ఫోక‌స్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దేశ‌, రాష్ట్రంలో నెల‌కొన్న సామాజిక, ఆర్థిక‌, రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తెలుసుకునేకందుకు ఇత‌ర రాష్ట్రాల కు చెందిన ఏజెన్సీల‌తో రేవంత్ స‌ర్వే నిర్వ‌హిస్తున్న‌ట్టు గాంధీ భ‌వ‌న్‌తో పాటు పార్టీ నాయ‌కుల్లో జ‌రుగుతోంది.


స‌ర్వేలో భాగంగా రాష్ట్ర ప్ర‌జ‌ల నాడీ ఏ విధంగా ఉంది అని తెలుసుకున్న రేవంత్ ఇక ఎలా ముందుకు వెళ్లాలి అని అంశంపై ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ చేపట్టిన కార్య‌క్ర‌మాల్లో మార్పులు, చేర్పులు చేయాలా అని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాల‌నే ప్ర‌ణాళిక‌లో రేవంత్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: