బ్రేకింగ్: మంత్రి పదవికి కేటిఆర్ రాజీనామా...?

Gullapally Rajesh
మంత్రి కేటిఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసారు నేడు. జిల్లాలో 104 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించాం అని అన్నారు ఆయన. 15 కోట్లతో జూరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేసారు. పక్క రాష్ట్రాలు తెలంగాణలో కేసీఆర్ పాలనను చూసి అసూయపడుతున్నాయి అని ఆయన అన్నారు. పైసలు కేంద్రానివి, రాష్ట్రానివి సోకులు అంటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నా. చేతనైతే సవాల్ ను స్వీకరించు అంటూ... నేను చెప్పేది తప్పైతే... రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్త అన్నారు. నీది తప్పైతే నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తవా అంటూ సవాల్ చేసారు. రాష్ట్రం నుంచి 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే... రాష్ట్రానికి ఇచ్చింది లక్ష 42 వేల కోట్లు మాత్రమే అనారు ఆయన. మొత్తం మీ పైసలే ఐతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని నిలదీశారు.
మోడీ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోంది అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్లలో ఉద్యోగ లక్ష 32 వేల 899 ఉద్యోగ నియామకాలు చేపట్టింది అన్నారు. బీజేపీ ఇస్తామన్న కోట్ల ఉద్యోగాలెక్కడపోయినయ్ అని నిలదీశారు. చరిత్రనే తప్ప, భవిష్యత్తు లేని పార్టీ కాంగ్రెస్ అన్నారు ఆయన. 70 ఏళ్లలో జరగని అభివృద్ది గద్వాలలో 7 ఏళ్లలో జరుగుతున్నాయి అని పేర్కొన్నారు. జరుగుతున్న అభివృద్ది కొంత మందికి మింగుడుపడుతలేదు అని ఎద్దేవా చేసారు. గట్టు, తుమ్మిళ్ల లిఫ్ట్ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం అన్నారు. వడ్లు కొనం అంటూ కేంద్ర ప్రభుత్వం (ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) చేతులెత్తేసింది అని ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: