కెసిఆర్ మాట కాంగ్రెస్ నోట...?

Gullapally Rajesh
తెలంగాణాలో బిజెపి విషయంలో ఇప్పుడు ఆసక్తి ఎక్కువగా ఉంది. పార్టీ ఎంత వరకు పోరాటం చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. బండి సంజయ్ పాదయాత్ర పార్టీకి కీలకంగా మారింది. నేడు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా లో బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ, హాజరైన బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రి బాబు మోహన్, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని మోదికి లేఖ రాసే దమ్ము కేసీఆర్ కు ఉందా అని నిలదీశారు.
బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళ తో కేసీఆర్ చెప్పిస్తున్నాడు అన్నారు. ఓల్డ్ సిటీ లో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్ కు లేదు అని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో కి ఎప్పటికి వెళ్ళరు.. కాంగ్రెస్ వాళ్లే వెళ్తారు అని స్పష్టం చేసారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయము చేసే పరిస్థితులు లో లేరు అని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కి ఉద్యోగాలు నోటిఫికేషన్ లు గుర్తుకి వస్తాయి అని అన్నారు.  ఉద్యోగాలు , నిరుద్యోగ భ్రుతి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. మళ్ళీ కొత్తగా పేద వారి బంధు అంటున్నారు అని ఉద్యమము లో సెప్టెంబర్ 17 ను నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర ను కనుమరుగు చేస్తున్నాడు అని మండిపడ్డారు. నిజాం కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదు అని వారు ఆరోపించారు.  అమిత్ షా నిర్మల్ సభ ను జయప్రదం చేయాలి అని బీజేపీ నాయకులు ప్రచార సభలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: