మెగా నిరీక్షణ?: జగన్ నుంచి చిరుకు పిలుపు?

RATNA KISHORE

కొద్ది రోజుల్లోనే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ఉంది. ఇంకొన్ని రోజుల‌కు ఆచార్య వ‌చ్చేస్తుంది. ఇంకొన్ని రెడీ ఫ‌ర్ రిలీజ్ అన్న విధంగా ఉన్నా యి. ఇలాంటి టెన్ష‌న్ పీరియ‌డ్ లో జ‌గ‌న్ - చిరు క‌ల‌యిక ఆస‌క్తికి కార‌ణం. కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా ఇదే! ప‌రిశ్ర‌మ వ ర్గాల‌లో త‌న‌పై ఉన్న అభిప్రాయాలు ప‌టాపంచ‌ల‌య్యే విధంగా జ‌గ‌న్ ఏవిధంగా స్పందిస్తారు? అన్న‌ది కూడా ఇప్పుడిక చ‌ర్చ‌కు తూగిన విష‌యం. సుదీర్ఘ నిరీక్ష‌ణ‌ల‌కు తెర‌దించుతూ సీఎంఓ చెప్పిన చ‌ల్ల‌ని క‌బురు సినిమా వాళ్ల బ‌తుకులు మార్చిన విధంగా ఉంటే మేలు.



చాలా రోజుల నుంచి వింటున్న మాట. చాలా రోజుల నుంచి అంటున్న మాట కూడా ఇదే! త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ను చిరు క‌ల‌వ‌బోతు న్నా ర‌ని! ఇదే మాట నిజం చేస్తూ ఈ నెల 20 న వీరిద్ద‌రూ భేటీ  కానున్నారు. దీంతో సినిమా వ‌ర్గాల్లో ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ ఒక‌టి నెల‌కొం ది. సీఎంతో భేటీ సంద‌ర్భంగా మెగాస్టార్ ఏం మాట్లాడ‌నున్నారు? ప‌రిశ్ర‌మ సంక్షేమానికి ఇప్ప‌టి  సంక్షోభ నివార‌ణ‌కు మె గాస్టార్ ఏం చెప్ప‌బోతున్నారు? అన్న‌ది ఓ హాట్ టాపిక్ గా మారింది. వాస్త‌వానికి జ‌గ‌న్ సీఎం ప‌ద‌వీ ప‌గ్గాలు అందుకున్న నాటి నుంచి ఆయ‌న ను క‌ల‌వాల‌ని సినీ ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఆలోచ‌న‌లు చేస్తూనే ఉన్నారు. కరోనా కార‌ణంగా వారంతా ఎటూ వెళ్ల‌లేక., ఈ ప్ర‌తిపాద‌న నుం చి విర‌మించుకున్నారు. తాజాగా టిక్కెట్ల గొడ‌వ ఒక‌టి నెల‌కొన్న సంద‌ర్భంలో..ఏపీ స‌ర్కారే వెబ్ పోర్ట‌ల్ ప్ర‌త్యేకంగా రూపొందించి టి క్కెట్లు అమ్ముతామ‌ని చెబుతుండ‌డంతో వీటిపై చిరు స్పంద‌న ఇంత‌వ‌ర‌కూ లేదు. ప‌వ‌న్ స్పందించాడు కానీ జ‌గ న్ పార్టీ నిర్ణ‌యా ల‌పై చిరు మాత్రం సైలెంట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ నిన్న‌టి వ‌ర‌కూ ఆంధ్రావ‌నిపై ఎన్నో ఆశ‌లు ఉంచుకు న్నా అవ‌న్నీ వ‌దిలేసుకుంది.



త‌మ భ‌విష్య‌త్ అగ‌మ్య గోచ‌రం కానుంద‌ని ఆందోళ‌న చెందుతుంది.దేశంలో ఎక్క‌డా లేనివిధంగా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల కా ర‌ణంగా తాము అవ‌స్థ‌లు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని, ఇప్ప‌టికే ఎటువంటి రాయితీలు ఇవ్వ‌ని ప్రభుత్వం కొత్త విధానాల ద్వారా వివాదా ల‌ను రాజేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని, దీని వ‌ల్ల జ‌గ‌న్ సాధించేదేంటి? అని కూడా ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నా రు. డైరెక్ట‌ర్ల నుంచి కూడా ఇ దే పెద‌వి విరుపు ఉంది.దేవా క‌ట్టా ఒక్క‌డే స్పందించాడు. మిగ‌తా వారంతా ఏం మాట్లాడితే ఏం జ‌రుగుతుందో అన్న బెంగ‌లోనూ, ఆందోళ‌న‌లోనూ ఉండిపోయారు. ఈ తరుణంలో దాసరి త‌రువాత అంత‌టి స్థాయిలో చిరు ప‌రిశ్ర‌మ పెద్ద‌గా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు రాయబా రం నడిపేందుకు వెళ్ల‌డం ఓ విధంగా శుభ‌ప‌రిణామం. ఆయ‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాలు ఏమౌతాయి వెయిట్ అండ్ సీ ?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: