రెబెల్స్‌కు రేవంత్ పిలుపు.. ఇక‌నైనా మారుతారా..?

Paloji Vinay
కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్‌ల‌తో క‌లిసి వెళ్లాల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకు సీఎం కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వెల్‌లో సెప్టెంబ‌ర్ 17న `ద‌ళిత గిరిజ‌న` దండోరా స‌భ‌ను వేదిక‌గా నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. ఈ స‌భ‌కు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈ విష‌యంపై ఇంకా ఢిల్లీ నుంచి ఎలాంటి స‌మాచారం అంద‌లేదు. దీంతో టీ కాంగ్రెస్ నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీంతో క‌న‌సీ సీనియ‌ర్ నాయ‌కులంద‌రినీ వేధిక‌పైకీ తీసుకువెళ్లి కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌తో స‌హా అంద‌రం క‌లిసే ఉన్నామ‌ని సంకేతాలు ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌.

   అయితే, ఈ విష‌యంలో వాళ్లు క‌లిసి వాస్తారా లేదా అనేది వేచి చూడాలి. కోమటి రెడ్డి బ్ర‌ద‌ర్స్, జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, వీ.హ‌నుమంత‌రావు, భ‌ట్టి విక్ర‌మార్క‌, కొడెం వీర‌య్య త‌దిత‌ర సీనియ‌ర్ నాయ‌కులు రేవంత్ రెడ్డిని త‌మ నాయ‌కుడిగా వ్య‌తిరేకిస్తున్న వాళ్లే.. రేవంత్‌కు టీపీసీసీ ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. అంటి ముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హారాల్లో పాల్గొంటున్నారు. రేవంత్ మాత్రం త‌న ఐడెంటిటితో పార్టీకి మ‌ళ్లీ జీవం పోయాల‌ని భావిస్తున్నాడు.
 
   సినియ‌ర్ల‌ను ఒక్క‌తాటిపైకి తీసుకురావడం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. ఇందుకు ఎవ‌రికి వారు మోనార్కులమే అని భావించ‌డ‌మే. పార్టీకి జీవం పోసే వాళ్లు కాకుండా వీళ్ల‌కు పార్టీలో ప‌ద‌వులు కావాలి ఎందుకంటే వీళ్లు సీనియ‌ర్లు కాబట్టి. అయితే, ఏం జ‌రిగినా సీనియ‌ర్ల‌తో క‌లిసి వెళ్లాల్సి ఉంది. దీని కోసం కాంగ్రెస్ పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీనీ ఏర్పాటు చేశారు. పార్టీని ప‌టిష్టం చేయ‌డానికి, రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఈ క‌మిటీని ఏర్పాటు చేశారు.


  పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్ చైర్మెన్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ క‌మిటీకి మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ క‌మిటీలో రేవంత్ రెడ్డి తో స‌హా సీనియ‌ర్ నాయ‌కులు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, రేణుకా చౌద‌రి ఇలా ముఖ్య‌నాయ‌కుల‌తో పాటు పైన చెప్పిన రేవంత్ వ్య‌తిరేక నాయ‌కులు ఇందులో భాగ‌స్వాములుగా ఉంటారు. మొత్తానికి రేవంత్ కు స‌పోర్ట్ ఇవ్వ‌ని వారే క‌మిటీలో 90 శాతానికి పైగా క‌మిటీలో భాగ‌స్వాముల‌ను చేశారు.

 ఈ కమిటీ వ్య‌వ‌హారాల‌న్ని ఢిల్లీ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తాయి  కాబ‌ట్టి. దీని వ‌ల్ల ఎవ‌రు తోక జాడించ‌డానికి, ఎదురు చెప్ప‌డానికి లేదు. స‌భ‌ల‌కు రాకుంటే ఎందుకు రావ‌ట్లేదో కార‌ణం చెప్పాల్సి ఉంటుంది. ఇలా పార్టీ రెబ‌ల్ నాయ‌కులంద‌రినీ రేవంత్ ఇలా త‌న చేత‌ల్లో పెట్టుకున్నాడ‌ని అంతా అనుకుంటున్నారు. మ‌రి దీని వ‌ల్ల ఎంత ఉప‌యోగం ఉంటుందో వేచి చూడాలి.
   
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: