జ్ఞానీ జైల్ సింగ్ మరో సారి గుర్తుకొచ్చారు

జ్ఞానీ జైల్ సింగ్ మరో సారి గుర్తుకొచ్చారు
 మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ పేరు చాలా కాలం తరువాత వార్తల్లోకి వచ్చింది.  రెండు రోజులుగా ఆయన పేరు వివిధ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించిన ఆయన ఆ పార్టీ అండదండలతో భారతదేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పీఠాన్నిఅధిష్టించారు. 1982 జూలై  25 నుంచి 1987 జూలై 27 వరకూ ఆయన దేశ ప్రధమ పౌరుడుగా సేవలందించారు.
తాజాగా ఆయన మనవడు ఇంద్రజీత్ సింగ్ బి.జె.పిలో చేరారు.  దీంతో మాజీ రాష్ట్రపతి పేరు మారోమారు వార్తల్లోకి వచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి,  పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ గౌతమ్, భి.జె.పి  జాతీయ అధికార ప్రతినిధి ఆర్. పి. సింగ్ తదితరులు  ఇంద్రజీత్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోనికి అహ్వనించారు.
 కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాన మం్రతి నరేంద్రమోడి చేపడుతున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయని ఈ సందర్భంగా ఇంద్రజీత్ పేర్కోన్నారు. నరేంద్ర మెడీ వల్ల పంజాబ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి ప్రభత్వాన్ని అధిరోహించిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మెస్థితిలో లేరని  ఇంద్రజీత్ వ్యాఖ్యానించారు.  గతంలో తాను తన రాజకీయ భవిష్యత్ గురించి తాత జ్ఞానీ జైల్ సింగ్  చాలా సార్లు ప్రస్తావించానన్నారు. ప్రతి సారి తన తాత ఒక సారి వెళ్లి వాజ్ పేయిని కలవు అని సలహా ఇచ్చే వారని ఇంద్రజీత్ సింగ్ వివరించారు.


కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు,
 రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. కాగా ఇంద్రజీత్ భారతీయ జనతా పార్టీలో చరడం పై మిశ్కమ స్పందన వ్యక్తమేంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: