బ్రేకింగ్: కేంద్ర మంత్రిని కలవడానికి ఇష్టపడని కేసీఆర్...?

Sahithya
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాష్ట్రంలో తిట్టడం కేంద్రంలో ఆయనతో సావాసం చేయడం వంటివి మనం తరుచుగా చూస్తున్నాం. ప్రస్తుతం సిఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను మొదలుపెట్టారు. వడివడిగా అడుగులు వేస్తూ బిజెపి అనే నావను తీరానికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. ఆటు పోట్లు ఎదురవుతున్నా కార్యకర్తల బలంగా రేయి అనక పగలనకా కష్టపడుతున్నారు. కేంద్రం నుంచి కూడా ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.
కాని ఇటీవల ఢిల్లీ పర్యటనకు కేసీఆర్ వెళ్ళడం, అక్కడ ఆయనతో వారం రోజుల పాటు కేంద్ర మంత్రులు మాట్లాడటం అనేది చర్చనీయాంశం. తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ అవినీతిపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు ఆవిడ. పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఉంచి దోషిగా నిలబెడతాం అని స్పష్టం చేస్తూ రైతుల సమస్యలపై మాట్లాడేందుకు  ఇవాళ నేనే సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వలేదు అని మండిపడ్డారు.
బండి సంజయ్ నేతృత్వంలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది అని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం మాటలు తప్ప... చేతల్లో చేసిందేమీ లేదు అన్నారు. హామీలు తప్ప... చేసింది శూన్యం అని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర నిరాశలో వున్నారు అని పైసలు కేంద్రానివి.... ప్రచారం కేసీఆర్ది అని విమర్శలు చేసారు. తెలంగాణ సీఎం ఎక్కడ ఉన్నాడు?   అని నిలదీశారు. గడిచిన ఏడేళ్లలో కేసీఆర్ ను ఎంతమంది కలిశారు? కేసీఆర్ ఎంతమందిని కలిశాడో ప్రజలకు తెలుసు అని ఆమె కామెంట్స్ చేసారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఇంట్లోనే కూర్చుని పాలన చేస్తున్నాడు... ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడు అని మండిపడ్డారు. తెలంగాణలో మార్పు, అభివృద్ధి అనేది కేవలం బీజేపీతోనే సాధ్యం అని స్పష్టం చేసారు శోభా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: