కాంగ్రెస్‌పై కేసీఆర్ పున‌రాలోచ‌న.. అందుకేనా.?

Paloji Vinay
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం ఒక చోటైనా కాంగ్రెస్‌కు ఎదురుండ‌ద‌ని భావించింది. ఆంధ్ర‌లో న‌ష్టాన్ని ముందుగానే ఊహించారు. ఎందుకంటే అది స్వ‌యంగా చేసుకున్న అప‌రాధ‌మే దాన్ని ఎవ‌రూ ఏం చేయాలేరు అని స‌ర్దుకుపోయారు. కానీ తెలంగాణ‌లో అలా చేయ‌లేక‌పోయారు ఎందుకంటే ఇక్కడ న‌మ్మ‌క ద్రోహం జ‌రిగింద‌ని అది కేసీఆర్ చేశార‌ని చాలా సార్లు కాంగ్రెస్ నేత‌లే బ‌హిరంగంగా విమ‌ర్శించారు కూడా.


    జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌ని కేసీఆర్ ఊరుకోలేదు.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తెలంగాణ‌లో కాంగ్ర‌స్‌ను నామ‌రూపాల్లేకుండా చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నాడు. అందుకు మాజీ టీపీసీసీతో క‌లిసి ఆ ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అది చాలా వ‌ర‌కు స‌ఫ‌లం అయింద‌నే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చాలామంది ఎమ్మెల్యేల‌ను కారు పార్టీలో క‌లిపేసుకున్నారు కేసీఆర్‌. మ‌రి ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానానికి స‌హించ‌లేని విష‌య‌మే అంటున్నారు.
 

 
   అయితే, రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో లేమ‌నుకుని కేసీఆర్ చేసిన మోసాల‌ను సంగ‌తి త‌రువాత చూద్దామ‌నుకున్నా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఊరుకోడ‌నిపిస్తోంది. అవ‌మాన భారంతో కృంగికృషించిపోతున్న బాబు మొద‌టి డిమాండ్ కేసీఆర్‌కు చుక్క‌లు చూపించ‌డ‌మేన‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ఆవిస్తున్నాయ‌ట‌. ఇవ‌న్ని ప‌క్క‌కుపోయినా రేవంత్ రెడ్డి అస్స‌లు ఊర‌కోర‌ట‌.. ఎందుకంటే ఓటుకు నోటు కేసు విష‌యంలో మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఎన్నిక‌ల ముందు రోజు బెడ్‌రూమ్‌లో ఉన్న రేవంత్ రెడ్డిని అలాగే ప‌ట్టుకుపోయారు పోలీసులు. ఎన్నో సార్లు పోలీస్ స్టేష‌న్ కు తీసుకువెళ్లారు.


  చివ‌రాఖ‌రుకు ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసిరావ‌డంలో ఇది కూడా ఓ మ‌త‌ల‌బు అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వైఎస్ రాజశేఖ‌ర్ చ‌నిపోయిన కొన్ని రోజుల‌కే జ‌గ‌న్‌పై సీబీఐ కేసు పెట్టింది, మాజీ ప్ర‌ధాని పీవీని కోర్టు మెట్లెక్కెలా చేసింది కాంగ్రెస్‌.. అలాంటిది ఇంత మోసం చేసిన కేసీన కాంగ్రెస్‌కు టార్గెట్ అవ్వ‌క మాన‌ద‌ని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్న కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రావొద్ద‌ని బీజేపీకి స‌పోర్ట్ చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధ‌మ‌య్యాడ‌ని రాజ‌కీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: