జనం కోసం పవన్ : ఇచ్ఛాపురంను ఎందుకు వదులుకున్నాడంటే?

RATNA KISHORE
ఓ సమస్యను రాజకీయంగా చూడకండి సామాజికంగానే చూడండి. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య అయినా, తుందుర్రు ఫ్యాక్టరీ సమస్య అయినా ఏదయినా మీరు సమస్యను సామాజికంగానే చూడండి..పరిష్కరించే క్రమాన యంత్రాంగం తరఫున తప్పులుం టే ప్రభుత్వానికి చెప్పండి.అంతేకానీ రాజకీయం వద్దు అనే చెబుతాడు పవన్. అదే ఆచరిస్తాడు. ఆ రోజు తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ చేసిన కాలుష్యంపై పోరాడాడు. సంబంధిత వర్గాలతో మాట్లాడాడు.

తూర్పు గోదావరి జిల్లాలో నీళ్లు ఏ విధంగా కలుషితం అయిపోతున్నాయో తెలు సుకుని ఎంతో బాధపడ్డాడు. స్పందించాడు. మీ రు అరెస్టు అయిపోండి నేను మీ వెంటే ఉంటానని బాధితులకు  హామీ ఇచ్చాడు. ఓ విధంగా టీడీపీ ప్రభుత్వం ఆ రోజు పాలకొల్లులో పూర్తి ఇరకాటంలో పడిపోయింది. అప్పటి ఇప్పటి ఎమ్మెల్యే నిమ్మన రామానాయు డు బాధి తులను ఉద్దేశించి మాట్లాడిన మాట లు వివాదాలకు తావిచ్చాయి. అప్పట్లో అదే ప్రాంతానికి చెందిన ప్రభుత్వ విప్ అంగర రామ్మోహ న్ (శాసన మండలికి సంబంధిం చి) సంయమనం పాటించినా స్థానిక ఎమ్మెల్యే మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలకు లోనయ్యారు.


సామాజిక మాధ్యమాల్లో పెద్ద యుద్ధమే జరిగింది. కొందరు స్థానిక యువకులు ఇదే అదునుగా రాజకీయంగా బలపడేందుకు కూ డా  ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలవరం రేపాయి. దీంతో జనసేన  పార్టీ తరఫున పవన్ చెప్పిన మాటలు తీవ్ర ప్రభావం చూపాయి. అదేవిధంగా ఇక్కడ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ (టీడీపీ) కన్నా జనసేననే ఆ రోజు దూసుకుపోయింది. కానీ పవన్ ఈ సమస్యను రాజకీయాలకు ఉపయోగించుకుని తీరాలని అనుకోలేదు. కిడ్నీ బాధితులకు మేలు చేస్తే చాలు అనే భావించారు. అందుకు ఏం చేయాలో అన్న విషయమై పరితపించారు. నేను ఇక్కడికి వచ్చింది  రాజకీయాలు చేయడానికి కాదు అని స్పష్టంగా చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్ష చేసినప్పుడు కూడా ఆ కొద్ది పాటి సమయంలోనే ఎందరో సామా జిక కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఆ రోజు ఇచ్ఛాపురం నుంచి పవన్ పోటీ చేస్తే ఫలితం మరో విధంగా ఉండేది. నేను ఈ సమస్యకు ఓ  పరిష్కారం దొరకాలని వచ్చాను..మీరు దయచేసి! నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని అడగవద్దు అని కూడా నిర్మొహమాటంగా చెప్పేశాడు. దటీజ్ పవన్. మరి! ఆ రోజు జనసేన కార్యకర్తలపై ఫైర్ అయిన నాయకులు ఇప్పుడు సైలెం ట్ అయిపోయారు ఎందుకు? అని అక్కడి వారిని అడిగామే అనుకోండి ఆ పార్టీకి అధికారం లేదు కదా! కనుక టీడీపీ లీడర్లు సైలెం ట్ అయిపోయారు సర్ అని అంటారు జన సేన కార్యకర్తలు.  

వాస్తవానికి జనసేనకు చెప్పుకోదగ్గ కార్యకర్తలు ఉన్నారు. చెప్పుకోదగ్గ స్థాయిలో జనం నుంచి మద్దతు ఉంది. ఎందుకని జనసేన రావాల్సినన్ని ఓట్లు, రావాల్సినన్ని సీట్లు గెలుచుకోలేకపోతోంది. క్షేత్ర స్థాయిలో పవన్ కల్యాణ్ ఎందుకని  ఫెయిల్ అయ్యాడు? ఆ యన నుంచి జనం ఆశిస్తున్నదేంటి? ఇవన్నీ ఆరా తీస్తే పవన్ తప్పులు ఎన్నో స్థానిక నాయకత్వాల తప్పులు కూడా ఆ..స్థాయిలో నే, ఆ..సంఖ్యలోనే, ఆ..తీవ్రతతోనే ఉన్నాయి.  సమస్యంటే పరిష్కారం కోసం నా దగ్గరకు వస్తున్నారు సరే మరి! ఓట్లెందుకు వాళ్లకు వేశారు అని ఓ సారి ఆవేదనలో పవన్ వ్యాఖ్యానించారు కూడా! అయినప్పటికీ నాకు చేతనైనంత సాయం మీకు చేస్తాను. మీ కోసం మీ తరఫున మాట్లాడతాను. అది నా బాధ్యత తప్పక నిర్వర్తిస్తాను.. అని ఎన్నో సార్లు చెప్పారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: