పవన్ వెరైటీ స్ట్రాటజీ...ఫిక్స్ అయిపోయారా?

M N Amaleswara rao
రాజకీయాల్లో ఏ నాయకుడుకైన కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ప్రత్యర్ధులకు ఎలా చెక్ పెట్టాలి....పార్టీని ఎలా బలోపేతం చేయాలి....ఎలా గెలవాలి అని...ఇలా చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కానీ ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు ఇలాంటి స్ట్రాటజీలు ఏమి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్లేషకుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. అసలు ఏ స్ట్రాటజీ లేకుండా ఉండటమే పవన్ వెరైటీ స్ట్రాటజీ అనుకుంటా అని మాట్లాడుతున్నారు.
ఎందుకంటే పవన్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక పార్టీని ఎలాగైనా గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి...సరే ఇప్పుడు ఓడిపోయిన పోయేది ఏమి లేదు...ఇంకా చాలా భవిష్యత్ ఉంది కాబట్టి....పార్టీని నిదానంగా బలోపేతం చేసి...నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే విధంగా పనిచేయాలి. కానీ పవన్ కల్యాణ్ అలాంటి పని ఏది చేస్తున్నట్లు లేదని తెలుస్తోంది.
ఇప్పటివరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఏమి పెద్దగా చేయలేదు. ప్రజా సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేయడం లేదు. సరే మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు. అలా అని సినిమాలు చేయడం తప్పుకాకపోయినా, పార్టీని పట్టించుకోవడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. పార్టీని పికప్ చేయాలనే ఆలోచన అసలు చేస్తున్నట్లు లేరు. కానీ జనసేన కార్యకర్తలు ఏమో పవన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. నెక్స్ట్ తమ నాయకుడుని సి‌ఎంగా చూడాలని వారు కలలు కంటున్నారు. ఆ కలలని పవన్ కల్లలు చేస్తున్నట్లు ఉన్నారు.
ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీని వల్ల పార్టీకి కొంచెం కూడా ఉపయోగం లేదనే చెప్పొచ్చు. అంటే పవన్ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవాలని అనుకుంటున్నట్లు లేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగో గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇక మళ్ళీ ఏదొక పార్టీతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా ముందుకెళ్దామలే అనే విధంగా పనిచేస్తున్నట్లు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఏదేమైనా పవన్ కంటూ ఒక స్ట్రాటజీ ఉంటే బెటర్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: