రేవంత్ రిపోర్ట్ లు...? రాహుల్ నిర్ణయాలు...?

Gullapally Rajesh
తెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే రేవంత్ రెడ్డి మాత్రం దూకుడుగా రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆయన తీవ్రస్థాయిలో కష్ట పడటమే కాకుండా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు కూడా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయనకు పార్టీ నేతల నుంచి సహకారం అందుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేకపోయినా రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా రాహుల్ గాంధీ... నివేదికల ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మంచి పేరు ఉన్న నాయకుల్ని పార్లమెంట్ ఇన్చార్జి కొనసాగించే అవకాశం ఉందని అలాగే సామాజికంగా కూడా బలం ఉన్నవారికి రాహుల్ గాంధీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే సూచనలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొన్ని నివేదికలు కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి అప్పగించారని టాక్.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా సహకరించే వారి పేర్లు సహకరించని వారి పేర్లను కూడా రేవంత్ రెడ్డి అప్పగించారు అని సమాచారం దీనితో కొంతమంది కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కూడా మొదలైందని అంటున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లే నేతలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీ విషయంలో చాలా సీరియస్ గా ఉండటం తో అటు అధికార టీఆర్ఎస్ పార్టీ అలాగే మరో ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. షర్మిల పార్టీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరి భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: