జయహో జగన్ : ఆయనకు మద్దతుగా తమిళ్ హీరో !

RATNA KISHORE
ఏపీ సీఎం మనకు నచ్చకున్నా పక్క రాష్ట్రంకు నచ్చేశారు. వారు మాత్రం జగన్ ను అదే పనిగా పొగడడం బాగుంది. దీంతో వైసీపీకి ఓ మైలేజీ దక్కింది. తమిళ నాట జగన్ కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. వీరంతా తమ సీఎం స్టాలిన్ ను కూడా జగన్ నే ఫాలో అవ్వమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నారు. వినోద మాధ్యమాల్లో ఇప్పటికే అత్యంత వెనుకబడిపోయిన థియేటర్ వ్యవస్థను ఇం తవరకూ ఏపీ సర్కారు గాడిలో పెట్టకపోయినా, తానే స్వయంగా ఓ పోర్టల్ ఏర్పాటుచేసి, ఆన్ లైన్ లో టిక్కెట్ల అమ్మకం చేసి, వ చ్చిన ఆదాయాన్ని సంబంధించిన వర్గాలకు ప్రతి నెల 26వ తారీఖు తరువాత చెల్లిస్తామని చెప్పడంతో ఇండస్ట్రీ అవాక్కైంది. దీనిపై వైసీపీ నిర్మాతలు మాట్లాడేందుకే భయపడిపోతున్నారు. రోజా కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ అదే చిత్తూరు కు చెందిన విశాల్ రెడ్డి మాత్రం స్పందించి జగన్ సర్ కు అండగా ఉన్నాడు.

ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై రాద్ధాంతం మామూలుగా లేదు. ఏ నిర్ణయం అయినా అదొక సంచలనం కాకుండా ఉండడం లేదు. తాజాగా టిక్కెట్ల అమ్మకంపై ప్రభుత్వం వెలువరించిన జీఓకు సంబంధించి టా లీవుడ్ పెద్దలు బయటకు మాట్లాడ డం లేదు కానీ లోలోపల అంతర్మథనం చెందుతున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తమకు అస్సలు అనుకూలంగా చేసిన పని ఒక్కటి కూడా లేదని, ఇలాంటి తరుణంలో వె బ్ పోర్టల్ పేరిట టిక్కెట్లు అమ్మడంపై జగన్ తమను సంప్రదించకుండా ఎ లా నిర్ణయం తీసుకుంటారని మండి పడుతున్నారు. వీరి కోపం ఎలా ఉన్నా టిక్కెట్ల అమ్మకం నిర్ణయం విశాల్ రెడ్డి కి మాత్రం నచ్చేసింది.

సినిమా టిక్కెట్ల అమ్మకం విషయమై ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని తమిళ్ హీరో విశాల్ ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా ఆయనొక ట్వీట్ కూడా చేశారు. ఇదే పద్ధతిని తమిళనాట కూడా అమలు చేయాలని సీఎం స్టాలిన్ ను ఆయన కోరారు. తమ దృష్టిలో ఇదొక మంచి విధానమని, దీని ద్వారా పారదర్శకత సాధ్యమని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇదే విషయాన్ని అనేక మం ది వివాదం చేస్తున్నారు. కొందరు బాహాటంగానే జ గన్ కు వ్యతిరేకంగా మాటలు చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఏపీ సర్కార్ తీసుకువస్తామన్న ప్రత్యేక వెబ్ పోర్టల్ విధానంపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు మూలాలు ఉన్న తమి ళ్ హీరో స్పం దించడం, టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. టిక్కెట్ అమ్మకాలపై ఇప్పటికే వస్తున్న విమర్శలను దాటి ఇలాంటి ప్ర యత్నాలు చేస్తే సినిమా పరిశ్రమతో పాటు, ప్రభుత్వం కూడా బాగుంటుందని, ఆదాయంలో లెక్కలపై ఓ స్పష్టత వస్తుందని విశాల్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై భిన్న స్పందనలు ఉన్నా జగన్ వర్గాలు మాత్రం ఆనందిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: