కేసు ముందుకు : లోకేశ్ నెత్తిపై ఫైబ‌ర్ పిడుగు?

RATNA KISHORE

అస‌లు అర్హ‌త లేకున్నా కొన్ని కంపెనీలను నాటి చంద్ర‌బాబు స‌ర్కారు నెత్తిన పెట్టుకోవ‌డం ఆ గుట్టు వైసీపీ లాగ‌డం కార‌ణంగా ఇ ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఫైబ‌ర్ నెట్ లిమిటెడ్ ( ఏపీఎస్ఎఫ్ఎల్) వివాదం ఒక‌టి రాజుకుంటోంది. ఈ కేసులో టీడీపీ పెద్ద‌ల‌కు వాటా లు ఉన్నాయ‌ని అభియోగాలు ఉన్నా, వీటిని నిరూప‌ణ చేయాల‌ని  కొంద‌రు ప‌సుపు పార్టీ పెద్ద‌లు  ప‌ట్టుబ‌డుతున్నారు. వాస్తవా నికి స‌రైన అర్హ‌త‌లు లేని కంపెనీకి బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి వాటాలు అప్ప‌ణంగా అప్ప‌గించేందుకు జ‌రిగిన ప్ర‌య‌త్నమే ఫ‌లిం చి.. న‌కిలీ ప‌త్రాల ద్వారా ఏపీఎస్ ఎఫ్ ఎల్ అధికారుల సాయంతో వీరంతా టెండ‌ర్లు కొట్టేశార‌ని సీఐడీ పేర్కొంద‌ని ప్ర‌ముఖ మీడి యా వెల్ల‌డి చేస్తున్న క‌థ‌నం.



చంద్ర‌బాబు హ‌యాంలో ఎంతో పేరు తెచ్చుకోవాల‌ని ఆశ ప‌డిన ఏపీ ఫైబ‌ర్ కంపెనీ లో చాలా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి అని, అవి కూ డా ఆ రోజు పైకి రాలేద‌ని, వెలుగు చూడ‌నివి తాము వెలుగులోకి తెచ్చామ‌ని వైసీపీ అంటోంది. దీనిపై సీఐడీ విచార‌ణ  జ‌రుగు తున్నందున నిందితులెవ్వ‌రో అన్న‌ది తేలిపోనుంది. ప్ర‌భుత్వానికి సంబంధించిన నిధులు దారి త‌ప్పిపోయాయ‌ని నాటి ఘ‌ట‌న‌కు  సంబంధించి ఇప్ప‌టికీ వినిపించే ఆరోప‌ణ‌.


ఏపీ ఫైబ‌ర్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఆ రోజు చిన్న‌బాబు నేతృత్వంలోనే కొన్ని ఒప్పందాలు చోటుచేసుకున్నాయ‌ని నెత్తీ నోరు కొ ట్టుకుంటున్న వైసీపీ తాజాగా ఏం మాట్లాడ‌నుందో అన్న‌ది ఆస‌క్తిక‌ర ప‌రిణామం.  చంద్ర‌బాబు హ‌యాంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ కంగా తీసుకున్న ఈ వ్య‌వ‌హారంలో డ‌బ్బులు ప‌క్క‌దోవ ప‌ట్టాయ‌ని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌ధాన ఆరోప‌ణ ఒక‌టి చేస్తున్న‌ది. దీనిపై సీ ఐడీ విచా ర‌ణ‌కు కూడా ఆదేశించింది. ఇందులో భాగంగా తొలి ద‌శ టెండ‌ర్ల‌పై సీఐడీ కేసు న‌మోదు చేసింద‌ని స‌మాచారం. ఆ రోజు ఘ‌టన‌కు కా ర‌ణ‌మ‌యిన ఇద్ద‌రి పేర్లు ప్ర‌ధానంగా విన‌ప‌డుతున్నాయి. టెండ‌రింగ్ లో కీల‌కంగా ఉన్న వేమూరి హ‌రి కృష్ణ ప్ర‌సాద్ (టెండ రింగ్ లో సాంకేతిక అంశాల మ‌దింపులో కీల‌క స‌భ్యుడు), టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్ ఎండీ తుమ్మ‌ల గోపీ చంద్  ఈ నేరానికి కార‌ణం అని తె లుస్తోంది. వీరిపై ఎఫ్ ఐ ఆర్ ను న‌మోదు చేసింద‌ని స‌మాచారం. ఎఫ్ ఐ ఆర్ లో 16 మంది పేర్ల‌ను చేర్చార‌ని స మాచారం. ఈ స్కాం లో 321 కోట్ల రూపాయ‌లు ప‌క్క‌దోవ ప‌ట్టాయ‌ని ఏపీ ఫైబ‌ర్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు సీఐడీ రంగంలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: