అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడంలో పవన్ ఫెయిల్ అయ్యాడా ?

VAMSI
ఏపీలో ఎన్నో లక్ష్యాలతో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన పార్టీని స్థాపించాడు. మామూలుగా మొదట్లో పార్టీని పెట్టే ఉద్దేశ్యం పవన్ కు మొదట్లో లేదు. కానీ 2009 లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి టీడీపీ మరియు బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో జరిగిన ప్రచార కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు. అలా ఆ ఎన్నికల్లో పవన్ చూడడానికి కోకొల్లలుగా అభిమానులు తరలి రావడం అతనికి జేజేలు పలకడం చూసిన నరేంద్ర మోదీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రావాలని అలాగే పార్టీ పెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలా పవన్ ఆ ఎన్నికల అనంతరం  పార్టీని పెట్టాడు. ఎవరైనా పార్టీ పెడతారు. ఇంతకు ముందు చాలా స్థానిక పార్టీలు వచ్చాయి. అయితే పార్టీకి కొన్ని నిబంధనలు నియమాలు ఉండాలి. పార్టీ వలన ప్రజలకు ప్రయోజనం ఉండాలి కదా. ప్రయోజనం సంగతి పక్కన పెడితే అసలు చాలా మందికి జనసేన పార్టీ ఉందనేది కూడా తెలియదు. పార్టీని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లడంలో జన సేన సమిష్టిగా ఫెయిల్ అయింది. ఎక్కడ మీటింగ్  పెట్టినా తండోప తండాలుగా జనాలు వస్తున్నారు. కానీ వారంతా కూడా సినిమాల వలన పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో వచ్చిన ఫ్యాన్స్ అని తెలుసుకోలేక పోయారు.
పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ప్రజలు ఆక్సెప్ట్ చేశారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఇంకా మంచి అభిప్రాయం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ తన కున్న కోట్లాది మంది అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక అయినా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలను అప్రోచ్ అయితే భవిష్యత్తు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: