ప‌వ‌న్ బీజేపీల పొత్తు... అధికార పార్టీ జెండా ఎత్తు..!

Paloji Vinay
 జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు మొద‌టిసారిగా రాజ‌కీయ వేదిక‌పైకెక్కారు. ప్ర‌జారాజ్యం తొలినాళ్లలో ప్ర‌చారం చేశారు. త‌రువాత సైలెంట్ అయిపోయారు. అనంత‌రం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో వీలినం చేసిన త‌రువాత ప‌వ‌న్ అస‌లు క‌నిపించ‌లేదు. ఇక 2014 ఎన్నికలకు ముందు, తాను ఒక పార్టీ పెడుతున్నట్టు ప్ర‌క‌టించి జ‌న‌సేన పార్టీని పెట్టి ప‌వ‌నిజం అనే పుస్త‌కాన్ని కూడా ఆవిష్క‌రించారు ప‌వ‌న్‌. ఆ తరువాత కొన్ని రోజుల్లోనే ఉన్న ఎన్నికలకు పార్టీ అప్పుడే సిద్ధంగా లేనందున టీడీపీ-బీజేపీ కూటమికి జ‌న‌సేనాని మద్దతు ప్రకటించారు.

ఏ సమస్య మీదనయినా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయాల్లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ప‌వ‌ర్ స్టార్ పార్ట్ టైం రాజకీయ నాయకుడంటూ  ఎద్దేవా కూడా చేసింది  అప్పటి ప్రతిపక్ష వైసీపీ. అప్పుడ‌ప్పుడు ఉద్య‌మాలు చేసినా అది కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. 2019 ఎన్నిక‌లు వ‌చ్చేనాటికి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో పోటీచేసిన జ‌న‌సేన ఘోర వైఫల్యం చెందింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీచేసిన రెండు స్థానాలో ఓట‌మి పాల‌య్యారు. కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిచాడు.

   త‌రువాత, త‌న‌కు ఒక స‌పోర్ట్ కావాల్సి వ‌చ్చింది. దీంతో ప‌వ‌న్ బీజేపీతో పొత్తు పెట్టుకుని త‌రువాత జ‌రిగిన  ప‌లు ఎన్నిక‌లకు బీజేపీకి స‌పోర్ట్ ఇస్తూ వ‌చ్చారు. కానీ బీజేపీ మొద‌ట్లో ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని హామినిచ్చి దాన్ని నిలుపుకోలేక పోయింది. దీంతో ఆ త‌రువాత పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయంటే అప్పుడు బీజేపీ ప‌రిస్తితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో బీజేపీ జ‌న‌సేన పొత్తుతో వైసీపీ లాభం పొందింది. ప్ర‌స్తుతం ఏ ఎన్నిక‌లు అయిన బీజేపీ జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే ఇత‌ర పార్టీల‌కు లాభం క‌లుగుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కానీ, ప‌వ‌న్ ఆది నుంచి బీజేపీకి స‌హ‌కారం అందిస్తూనే వ‌స్తున్నాడు. మ‌రి భ‌విష్య‌త్తులో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: