జనసేన జనాల్లోకి వెళ్లక పోవడానికి కారణాలు ఇవేనా ..?

MOHAN BABU
తెలుగు సిల్వర్ స్క్రీన్ పై  అన్నకు తగ్గ తమ్ముడుగా నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. యూత్ లో తిరుగు లేనంత  క్రేజ్ సంపాదించిన పవర్ స్టార్ తన అన్నతోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి వదిలేసిన కానీ అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ మరో పార్టీ పెట్టి  ఏడు సంవత్సరాలు అవుతుంది. ఈ ఏడేళ్ల ప్రయాణంలో పవన్ పార్టీ అనుకున్న దిశగా అడుగులు వేసిందా..? అనుకున్నంతా ప్రజల్లోకి వెళ్లిందా..? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..? ఆయన చేసింది తక్కువ సినిమాలే, అయినా తక్కువ సమయంలో  తన అన్న కంటే ఎక్కువ పవర్ చూపించారని చెప్పవచ్చు. జనాల్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఆయన, తన అన్న వెంట నేను పెట్టిన పార్టీ లో  2009వ సంవత్సరంలో  తన రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ అన్న  మధ్యలోనే తన పార్టీని వదిలేయడంతో నిరుత్సాహం చెందిన పవన్ 2014లో కొత్తగా జనసేన పార్టీని పెట్టేశాడు. అన్నది సామాజిక న్యాయం అయితే  నాది సమన్యాయం అంటూ, వేలాది మంది జనాలతో తన పార్టీని ప్రకటించాడు పవన్. ఆ రోజే మోడీ లాంటి నాయకుడు దేశానికి అవసరమని కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అంటూ నినాదం అందుకున్నాడు.

ఆ సమయంలో  మోడీ చంద్రబాబు లాంటి దక్షత కలిగినటువంటి నాయకులతో పోటీ చేయడానికి సిద్ధంగా లేనని చెప్పాడు. ఆ సమయంలో మోదీ, చంద్రబాబు, పవన్ ల కలయిక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపింది. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు . మోడీ పాలనపై భ్రమలు తొలిగాయో లేదా పవన్ అనుకున్న వ్యూహాలు నెరవేరలేదో తెలియదు కానీ, కాస్త బీజేపీకి దూరమై పోయారు. హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామని బీజేపీ అనడంతో పాచిపోయిన లడ్డు అని విమర్శలు కూడా చేశారు పవన్. ఆ తర్వాత  ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ  సభలు సమావేశాలు పెడుతూ ఆవేదనంతా ప్రసంగాలతో ప్రజల ముందు ఉంచారు. మోడీపై ఆరోపణలు చేస్తూ సౌత్ ను చిన్నచూపు చూస్తున్నారని విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో  కమల నాదులతో దోస్తీ చేసి ప్రచారం చేసిన పవన్  తర్వాత అదే పార్టీకి బద్ధ శత్రువులైన ఎర్రజెండా పార్టీలతో జత కట్టాడు పవన్. లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడాడు. ఇలా ఆయా పార్టీల వారు కూడా పవన్ తో కలిసి సభలు సమావేశాలు ప్రసంగాలతో తిరిగారు. ఇన్ని చేసినా పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో కలిసి రాలేదు.

సర్వేలు చేయించుకొని మరి  భీమవరం గాజువాకలో  పోటీ చేసి ఓడిపోయారు పవన్. రాజోలిలో రాపాక  క్యాండెట్  స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. పేరుకు ఆయన  జనసేన నాయకుడు అయిన వైసీపీకి అనుబంధంగా కొనసాగిన వ్యక్తి అని చెప్పవచ్చు.  2019 ఎన్నికల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ పాత మిత్రుడు వద్దకే వెళ్లి  కొత్తగా స్నేహాన్ని మొదలుపెట్టారు. ఇక 2024 సాధారణ ఎన్నికల వరకు తమ స్నేహం కొనసాగుతోందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఏడు సంవత్సరాలలో ఒక వైసీపీ పార్టీ తప్ప అన్ని పార్టీలతో స్నేహం చేసిన పవన్ కళ్యాణ్  సాధారణ ఎన్నికల వరకు కమలనాథులతో కుదురుగా ఉంటారా..? లేదా మళ్లీ మాట మారుస్తారు అనేది రాబోవు రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ పార్టీలు మారడం, ఎందులోనూ కుదురుగా లేకపోవడం  వలన జనాల్లో అంతగా ఇమేజ్  పొందలేకపోయారు అన్నది జగమెరిగిన సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: