"జనసేనాని" పొత్తులతో సాధించింది ఏంటి ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు నాలుగు. అవి వైసీపీ, టీడీపీ, బీజేపీ మరియు జనసేన. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. మిగిలిన పార్టీలు అన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని భిన్న వ్యూహాలను రచిస్తున్నారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వైసీపీకి వేరే శత్రువు అవసరం లేదు. సొంత పార్టీ నేతలే చేస్తున్న తప్పులకు పార్టీపై విముఖత ఏర్పడుతుంది. ప్రభుత్వ పాలన సరిగా లేదని ఇప్పటికే ఒక టాక్ వచ్చేసింది. ఇది కనుక ఇలాగే కొనసాగితే వైసీపీ ఓటమి పక్కా. ఈ అవకాశాన్ని సరిగా వాడుకోవడంలో ముఖ్యంగా జనసెన ఫెయిల్ అవుతోంది అని చెప్పాలి. జనసేన కు అద్యక్షుడిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ అభివృద్ది కోసం ఏమి చేస్తున్నాడు అనే విషయంపై ఒకసారి పునరాలోచించుకోవాలి.
ఒకసారి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే గతంలో 2009 లో పార్టీ పెట్టక ముందు వరకు  ఏపీలో అప్పుడప్పుడే జగన్ వైసీపీ పార్టీ స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలను రచిస్తున్నాడు. ఆ సమయంలో టీడీపీ మరియు బీజేపీలు పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ వీరికి మద్దతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత 2014 లో పవన్ కళ్యాణ్ అందరితో చర్చించి జనసేన  పార్టీని స్థాపించాడు. ఇక అప్పటి నుండి ఎక్కువగా బహిరంగ సభలు. మీటింగ్ లను పెడుతున్నాడు కానీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనుకునే ప్రయత్నాన్ని చేయలేదని చెప్పాలి. అంతే కాకుండా రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం విఫలం అయింది. దానితో పవన్ కళ్యాణ్ తో మళ్లీ చెడింది.  
ఆ తరువాత 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సీపీఐ సీపీఎం లతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఒక్క రాజోలు ఎమ్మెల్యే సీటు తప్ప ఎక్కడా గెలిచింది లేదు. ఆఖరికి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం విశేషం. మళ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో జట్టు కట్టాడు. కానీ ఇలా ఇన్ని సార్లు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఏమి సాధించాడు అనేది అర్థం కాలేదు. ఇన్ని పొత్తుల వల్ల లాభం ఏమిటో పవన్ కళ్యాణ్ కి అయినా తెలుసా అన్నది ప్రజల ప్రశ్న. ఇకనైనా ఒంటరిగా తన బలం ఏమిటో తెలుసుకుని, ఆ బలాన్ని ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అనేది ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ని అభిమానించే కోట్లాది మంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: