అంత టైం వేస్ట్.. 5 వేలు కట్టండి : ఏపీ హైకోర్టు

praveen
ఇటీవలే గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం వి. అపరా పురం సర్పంచ్ ఉపాధిహామీ నిధుల విషయంలో అక్రమాలకు పాల్పడిన అంశం ఏకంగా హై కోర్టు మెట్లెక్కింది. అయితే ఈ అంశంపై విచారణ జరిపిన హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. వి అపార పురం సర్పంచ్ రోజా రాణి సచివాలయం నిర్మాణానికి ఇచ్చిన ఉపాధి నిధులను ఇప్పటివరకు కాంట్రాక్టర్కు చెల్లించలేదు. ఈ క్రమంలోనే ఇక సర్పంచ్ ని ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరుతూ పంచాయతీ అధికారి సర్పంచ్ కు షోకాజ్ నోటీసులు జారీచేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అటు అధికారీ నుంచి షోకాజ్ నోటీసులు వచ్చినప్పటికీ సర్పంచ్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి స్పందించలేదు. దీంతో ఏకంగా సర్పంచ్ చెక్ పవర్ ను మూడు నెలల పాటు రద్దుచేస్తూ జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఇక జిల్లా అధికారులు తన పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్ రోజా రాణి అధికారుల ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కదా ఇక రోజా రాణి వేసిన పిటిషన్ పై అటు ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది.  ఈ క్రమంలోనే భవన నిర్మాణంపై గ్రామస్తులు నుంచి ఫిర్యాదు అందుకున్నామని.. అయితే నిర్మాణ పనులకు సంబంధించిన రికార్డులు తనవద్ద లేవని కావున నిధులు చెల్లించలేను అంటూ సర్పంచ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొనటం గమనార్హం.

 అయితే అటు సర్పంచ్ దాఖలు చేసిన పిటిషన్ ను పూర్తిగా పరిశీలించిన ఏపీ హైకోర్టు ఈ పిటీషన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా సర్పంచ్ నిర్లక్ష్యం వహించడం సరైనది కాదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. జరిగిన పనులకు నిధులు చెల్లించేందుకు వచ్చిన నిధులను ఆపే అధికారం మీకు ఎక్కడిది అంటూ ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. గతంలో నిర్వహించిన ఉపాధి పనులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు చెల్లించలేను అంటూ అటు పిటిషన్లో పేర్కొన్న సర్పంచ్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను ఏపీ న్యాయసేవాధికార సంస్థకు రెండు వారాల్లోగా 5000 రూపాయలు  చెల్లించాలి అంటూ ఏపీ హైకోర్టు ఆదేశించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: