గుజరాత్ సిఎంగా ఆయనే...? మోడీ కులాల లెక్క...?

Sahithya
గుజరాత్ సిఎం పదవికి విజయ్ రూపాని రాజీనామా చేయడంతో తదుపరి సిఎం ఎవరు అనేది బిజెపిలో హాట్ టాపిక్ అయింది. మధ్యాహ్నం 2 గంటలకు అహమ్మదాబాద్ లో బిజెపి శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ని బిజెపి శాసన సభ్యులు ఎన్నుకునే అవకాశం ఉంది. పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ , బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సీఆర్ పాటిల్ తో కేంద్ర పరిశీలకుల సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వంపై సీనియర్ నేతల అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి పార్టీ పరిశీలకులు వివరిస్తారు. తన ముఖ్యమంత్రి ఎన్నిక సాఫీగా జరిగేలా జాగ్రత్తలు వహిస్తున్న కేంద్ర నాయకత్వం... ప్రధాని మోడి ఆశీస్సులు ఉన్న వ్యక్తే తదుపరి గుజరాత్ నూతన సీఎం అంటూ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. 2017 ఎన్నికల కంటే ముందు కూడా 2016లో ముఖ్యమంత్రి ని  మార్చింది బిజెపి ప్రభుత్వం. 2016 ముఖ్యమంత్రి గా ఉన్న ఆనందీ బెన్ పటేల్ ను మార్చి ఆమె స్థానంలో విజయ్ రూపానీని కేంద్ర నాయకత్వం నియమించింది.
ప్రస్తుతం విజయ్ రూపాని  స్థానంలో మరొకరికి పట్టం కడుతున్నారు బిజెపి పెద్దలు. 2016 ఫార్మూలాను మరోసారి అమలుపరుస్తున్నది బిజెపి. గుజరాత్ సీఎంగా తనదైన ముద్రవేసుకున్న ప్రధాని మోదీ వారసుడి ఎంపిక కోసం కసరత్తు గట్టిగానే చేస్తుంది జాతీయ నాయకత్వం. కేంద్ర మంత్రి మన్సుక్ లాల్ మాండవీయాకు ప్రధాని ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. పలు సమావేశాలలో కేంద్ర మంత్రి పనితీరును ప్రశంసించిన ప్రధాని మోడీ.. ఆయనను సిఎం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. గుజరాత్ లో మెజారిటీ వర్గంగా ఉన్న పటేదార్ సామాజిక వర్గానికి సీఎం అవకాశం ఉందని జాతీయ వర్గాలు అంటున్నాయి. గుజరాత్ లో 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 60 కి పైగా నియోజకవర్గాలలో పటేదార్ సామాజిక వర్గం కీలకంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: