"జనసేన" పార్టీ భవిష్యత్తు ఏమిటో?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు జోరు మీదున్నాయి. ఇవి కూడా ప్రభుత్వ పాలన టార్గెట్ చేసే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. మొదటి సంవత్సరం తన పాలనలో జగన్ మార్క్ చూపినా, ఆ తర్వాత నుండి వివిధ వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖతను మూత గట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ఒకటి. అయితే ఇప్పటికీ ఈ పార్టీని స్థాపించి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఈ నాటికీ ఒక లాండ్ మార్క్ లేదు. ప్రజల్లో పార్టీ మీద సదభిప్రాయం లేదు. ఒక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏడేళ్లు పడుతుందా ? ఇంకా ఎన్నేళ్లు కావాలి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ గానే ప్రజలకు తెలుసు. అందుకే అతనిని అందరూ అభిమానిస్తారు. రాజకీయ పరంగా ఊహించినంత ఆదరణ దక్కలేదని స్పష్టంగా తెలుస్తోంది. 

మరి ఇందుకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రయత్నాలు చేశారా ? లేదు అనే చెప్పాలి. ఇప్పటికీ ఒక సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే ఎన్నికలు పూర్తయ్యి రెండున్నరేళ్ల గడుస్తున్నా పార్టీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. ఎన్న కల  ముందు తనా ఆవేశ పూరితమైన ప్రసంగాలతో ప్రజల్లో కొంతవరకు నమ్మకం కలిగించినా అవే కేవలం స్క్రిప్ట్ లని తెలియడానికి చాలా కాలం పట్టలేదు. మనసులో నుండి వచ్చే భావాలకు మాత్రమే వాస్తవ రూపం  వస్తుంది. అంతే కానీ పుస్తకాల్లో రాసిన రాతలు ప్రజలకు చెప్పడం  వలన ప్రయోజనం ఏమీ ఉండదు.
ఇప్పటికీ కూడా జనసేన పార్టీపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. కానీ సరైన నాయకులు లేకపోవడమే పార్టీ బలహీనం కావడానికి కారణమని తెలుస్తోంది. అన్నింటికన్నా ముందు పార్టీలో బలమైన నాయక్ వర్గం ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరమని తెలుస్తోంది. ఈ విధంగా చేస్తేనే కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా సీట్లను పెంచుకునే అవకాశం ఉంది. లేదంటే జనసేన పార్టీ భవిష్యత్తు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. జనసేనాని ఇకనైనా మేలుకో...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: