గుజరాత్ ముఖ్యమంత్రిగా జైషా..! నిజమేనా..?

NAGARJUNA NAKKA
గుజరాత్ రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురవుతున్నాయి. ఆ రాష్ట్ర సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడం.. ఆ లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందించడం చకచకా జరిగిపోయింది. గుజరాత్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాజకీయాల్లో ఆకస్మిక పరిణామాలు చూసి అవాక్కయ్యారు. సీఎం కాకముందు విజయ్ రూపానీ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారు. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడపడంతో కీలక భూమిక పోషించారు. అలా ఆయనకు మంచిపేరు సంపాదించుకొని..అనతి కాలంలోనే సీఎం పదవిని అధిరోహించగలిగారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.  
సాధారణంగా డిసెంబర్ 2022వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. అంతకుముందు కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప, ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్‌ రావత్‌, తీరథ్‌ సింగ్‌ రావత్‌ కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు గుజరాత్ సీఎం వంతు వచ్చింది.  కూడా సీఎం పదవులకు రాజీనామా చేశారు.
విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉధయం గాంధీనగర్ లో శాసనభ సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్ షా సారథ్యం వహించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలోనే సీఎం ఎవరు అనేదానిపై చర్చ జరుగనుంది. అయితే అమిత్ షా కుమారుడు జైషా వైపే అందరి దృష్టి ఉంది. ఆయన్ను సీఎంగా ఎన్నుకుంటారనే టాక్ గట్టిగా నడుస్తోంది.
అమిత్ షా మోడీకి నమ్మిన బంటుగా ఉండటం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. కేంద్ర హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తుండటం. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైషా సారథ్యంలో అయితే.. ఆ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని భావిస్తోంది కమలం పార్టీ. జైషా ప్రముఖ వ్యాపార వేత్త. బీసీసీఐ కార్యదర్శి గానూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. అంతకుముందు షా టెంపుల్ ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్లలో ఒకరిగా పనిచేశారు. అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం సీజీఏ నిర్మాణంలో కీలక బాధ్యత వహించారు.  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: