నెట్టింటి గొడ‌వ : వర‌దలు వెళ్లాక సీఎం రాక ఎందుకు?

RATNA KISHORE

విప‌త్తులు వ‌స్తే ప్ర‌భుత్వాలు స్పందించాలి. విపత్తులు చుట్టుముడితే వాటి నివార‌ణ‌కు ప్ర‌భుత్వాలే చ‌ర్య‌లు తీసుకుని తీరాలి. కానీ భారీ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్పందించిన తీరే విమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతోంది. కేసీఆర్ ఢిల్లీలో ఉండిపో యారు. తెలంగాణ స‌మ‌స్యల విష‌య‌మై  ఢిల్లీ పెద్ద‌ల‌తో చ‌ర్చించేందుకు, వివిధ శాఖ‌ల‌కు చెందిన మంత్రుల‌తో చ‌ర్చించేందుకు త‌న ప‌ర్య‌ట‌న స‌మ‌యాన్ని కేటాయించారు. అదే సంద‌ర్భంలో ఇక్క‌డి అధికారుల‌ను ఆయ‌న అప్ర‌మ‌త్తం చేసినా ఫ‌లితం లేక‌పో యింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌నను అర్ధంత‌రంగా ముగించుకుని రావాల్సిన సీఎం వ‌ర‌ద‌ల ఉద్ధృతి త‌గ్గాక ఇక్క‌డికి చేరుకోవ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. పండుగ వేళ పిల్లా పాప‌ల‌తో హాయిగా ఉండాల్సిన వారంతా చుట్టూ నీరుతో నానా అవ‌స్థ పడుతూ, తిండికి గ‌తిలే కుండా అయిపోయామ‌ని ఎంద‌రో బాధితులు క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ స్థానిక నాయ‌క‌త్వం చ‌లించ‌లేదు. ఇప్ప టికి కూడా ప్ర‌భావిత ప్రాంతాల‌ను వీరు సంద‌ర్శించ‌క‌పోవ‌డం విచార‌కరం. ఓట్లు అడిగే నేత‌లు త‌మ‌కు క‌ష్టాలు వ‌స్తే మాత్రం ఏ మా త్రం స్పందించ‌కుండా ఏమీ తెలియ‌ని విధంగా న‌టించ‌డం అన్న‌ది ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అన్న వాద‌న ఒక‌టి ఇప్పుడు వినిపిస్తుంది.
క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల‌, వ‌రంగ‌ల్ , ఆదిలాబాద్ జిల్లాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల‌లో స‌హాయ‌క చ‌ర్య‌లు కూ డా పెద్ద‌గా లేవు. చాలా చోట్ల ఆహారం అంద‌క బాధితులు అవ‌స్థ‌లు పడ్డారు. ప్ర‌జాప్ర‌తినిధులు సైతం ముఖం చాటేశారు. స్థానిక అధికారులు చేప‌ట్టిన చర్య‌లు కూడా అంతంత మాత్ర‌మే కావ‌డంతో ఎక్క‌డా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించిన ఘ‌ట‌న‌లే పెద్ద‌గా చోటుచేసుకోలేదు. జ‌ల‌మ‌యం అయిన ఇళ్ల‌లోనే బాధితులంతా బిక్కు బిక్కుమ‌ని కాలం గ‌డిపారు బాధితులు. ఎంఎల్ సీ క‌విత కొన్ని చోట్ల క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో నిత్యావ‌స‌రాలు అందించారు త‌ప్ప మిగ‌తా ప్ర‌జా ప్ర‌తినిధులంతా ఇంటికే ప‌రిమితం కావ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు అందుకున్నారు. కేటీఆర్ కూడా హైద్రాబాద్ లోనే ఉండిపో యారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశం కార‌ణంగా ఆయన పార్టీ శ్రేణుల‌తో ముచ్చ‌టించారే త‌ప్ప అధికారుల్లో ఎటువంటి చ‌ల‌నం తీసుకు రాలేక‌పోయారు. టెలిఫోన్ కాన్ఫ‌రెన్సుల‌లో మాట్లాడిన‌ప్ప‌టికీ అవేవీ పెద్ద‌గా ప‌ని చేయ‌లేదు. క్షేత్ర స్థాయిలో నాయ‌కులు లేకుండా అధికారులు ప‌ని చేస్తారు అని అనుకోవ‌డం అంటే అంత‌కుమించిన అవివేకం ఇంకొక‌టి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: