రేవంత్ సేఫ్ : ఫిర్యాదులు ప‌ట్టించుకోని రాహుల్ !

RATNA KISHORE
అనేక కుమ్ములాట‌లు, అంత‌ర్గ‌త కొట్లాట‌లు దాటుకుని కాంగ్రెస్ పార్టీని న‌డ‌ప‌డం అన్న‌ది అంత సులువు కాదు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనూ ఇవే ఉన్నాయి. త‌రువాత వ‌చ్చిన వారికీ ఇవే ఎదుర‌య్యాయి. పార్టీ కానీ పార్టీ నేత. ఓ విధంగా వ‌ల‌స నేత‌కు కీల‌క ప‌ద‌వి ఎందుకు అన్న ప్ర‌శ్న ప్ర‌తిరోజూ వ‌స్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనుయాయులు రేవంత్ రెడ్డిని త‌మ నాయ‌కుడిగా గుర్తిం చ‌రు. అదేవిధంగా ఆ రోజు చంద్ర‌బాబు ఆదేశాలు అనుసారం వైఎస్సార్ కుటుంబంపై చేసిన ఘాటు వ్యాఖ్య‌లు, విచ‌క్ష‌ణార‌హిత ప్ర‌క‌ట‌న‌లు కూడా ఎవ్వ‌రూ మ‌రిచిపోరు. దీంతో వైఎస్సార్ వ‌ర్గం వేరుగా పోవాల‌ని ఇప్ప‌టికిప్పుడు అనుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ స‌రం లేదు. కానీ వీరంతా అధిష్టానం ద‌గ్గ‌ర పంచాయ‌తీ పెట్టాల‌ని యోచిస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో భాగంగా ఓ విడ‌త ఢి ల్లీలో రేవంత్ కు వ్య‌తిరేకంగా రాహుల్ ద‌గ్గ‌ర కొంద‌రు అసమ్మ‌తి వాదులు పంచాయతీ పెట్టార‌ని, రాహుల్ వీరిని వారించార‌ని స‌మాచారం.
దీక్ష‌లు బాగున్నాయ‌ని టాక్
వ‌రుస దీక్ష‌లు, ధ‌ర్నాలు అన్నవి ఇంత‌కాలం లేవు  క‌నుక పార్టీకో జోష్ తీసుకువ‌చ్చాడ‌ని కొత్త బాస్ విష‌య‌మై చాలా మంది రాహుల్ కు చెప్పారు. అదేవిధంగా కేసీఆర్ పై చూపిస్తున్న దూకుడు ఓ విధంగా సాహ‌స‌మేన‌ని, కేసులు, కుట్ర‌లు అన్న‌వి ఉంటాయ‌ని, వాటికి  భ‌య‌ప‌డ‌కుండా త‌న ప‌ని తాను చేసుకోవ‌డంలో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యాడ‌ని ఇంకొంద‌రు అధిష్టానం ఎదుట  గ‌ళం విప్పార‌ని కూడా  స‌మాచారం. టీపీసీసీ బాస్ ప‌నితీరు బాగుంద‌న్న‌ది ఓ వ‌ర్గం ప్ర‌శంస కూడా! ఇవ‌న్నీ ఉన్న‌ప్పుడు ప‌ద‌విని భారం అనుకోక బాధ్య‌త‌గా నిర్వ‌ర్తిస్తున్న‌ప్పుడు కాంగ్రెస్  అధిష్టానం అప్ప‌టిలా
చెప్పుడు మాట‌లు వినేందుకు అయితే సిద్ధంగా లేద‌న్న‌ది వాస్త‌వం.
ఇంకా చెప్పాలంటే...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌గ్గాలు అందుకున్నాక పార్టీ తీసుకునే చ‌ర్య‌ల‌లో వేగం పెరిగింది. పార్టీ ప‌నుల‌లో వేగం పెరిగింది. అదే విధంగా ఇత‌ర పార్టీల నేత‌లు, కాంగ్రెస్ ను వీడిపోయిన నేత‌లు సైతం రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. ఈ దిశ‌గా వారు పార్టీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. కొంద‌రు అసంతృప్తుల‌ను సైతం రేవంత్ పిలిచి మాట్లాడి, త‌న దారిలోకి తెచ్చుకుంటున్నారు. కొంద‌రు బాహాటంగా విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నా అవ‌న్నీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ బ‌లోపేత‌మే ధ్యేయంగా రేవంత్ ప‌నిచేస్తుండ‌డంతో అధిష్టానం ద‌గ్గ‌ర మంచి మార్కులే కొట్టేశాడు. రాష్ట్ర వ్య‌వ‌హారాలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ కూడా రేవంత్ కు మ‌ద్ద‌తుగానే ఉన్నారు. ఆయ‌న కూడా నివేదిక ఒక‌టి తెప్పించి, రాష్ట్ర ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: