రేవంత్ ఫోర్స్ : కేసీఆర్ పై సీబీఐ ?

RATNA KISHORE

గులాబీ పార్టీకి క‌మ‌లం పార్టీకి స్నేహాలున్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇది నిజ‌మో కాదో కానీ బండి సంజ‌య్ ఎందుకు ఢిల్లీ వేదిక‌గా త‌గువుకు దిగ‌రు అని కూడా అడుగుతున్నారు టీపీసీసీ చీఫ్‌. ఇది కూడా నిజ‌మో కాదో కానీ కిష‌న్ రెడ్డి ఇప్ప‌టికీ కేసీఆర్ కు అనుగుణంగా ప‌నిచేస్తున్నారా? ఇవ‌న్నీ కొత్త లీడ‌రు అయిన రేవంత్ కు వ‌చ్చిన సందేహాలు.. ఆ కార‌ణంగా ఆయ‌న ఢిల్లీ కేంద్రంగా నానా త‌గువులు రాజేస్తున్నారు. కేసీఆర్ పై ద‌ర్యాప్తు సంఘాల‌కు ఫిర్యాదులు చేసి, ఆ విధంగా ఉనికి చాటుకుంటున్నారు.




త్వ‌ర‌లో తెలంగాణ రాజ‌కీయాల్లో కొన్ని ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. గులాబీ పార్టీ పై మ‌రిన్ని అవినీతి ఆరోప‌ణ‌లు వెలు గు చూడ‌నున్నాయి. సీబీఐ రిపోర్టు ఒక‌టి వెలుగులోకి వ‌స్తే అందుకు త‌గ్గ విచార‌ణ‌కు కేంద్రం అనుమ‌తిస్తే భూముల వ్య‌వ‌హారం కానీ మిగ‌తా ఆర్థిక నేరాలు కానీ తేలుతుయి. కానీ రేవంత్ చెప్పిన విధంగా కేంద్రం న‌డుచుకోదు క‌నుక ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుని క్రెడిట్ అంతా కాంగ్రెస్ ఖాతాలో జ‌మ చేసేందుకు బీజేపీకి ఇష్టం లేదు. ఈ త‌రుణాన సీబీఐ భూముల వ్య‌వ‌హా రంలో త‌ల‌దూరుస్తుందా? లేదా త‌న‌కెందుక‌ని ఊరుకుంటుందా?





ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రేవంత్ రెడ్డి అదే ప‌నిగా బీజేపీని, టీఆర్ఎస్ ను ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారివి ర‌హ‌స్య స్నేహాలు అని చెబుతున్నారు. తెలంగాణ‌లో గులాబీ పార్టీ పై పోరాడే బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి తాను చెప్పిన విధంగా భూ వివాదాల‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టేలా ఎందుకు ఒత్తిడి తీసుకు రారు అని ప్ర‌శ్నించారు. ఇదే నేప‌థ్యంలో కోకాపేట భూముల వివాదంపై మ‌ళ్లీ గొంతెత్తేందుకు ప్ర‌య‌త్నిస్తోంది కాంగ్రెస్. ఇందులో కొందరు ఐఏఎస్ ల పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ, విచార‌ణ చేప‌ట్టాల‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఢిల్లీలో సీబీఐ డైరెక్ట‌ర్ ను క‌లిసి ఈ విష‌య‌మై చ‌ర్చించ‌డంతో ఇంకొన్ని కీల‌క అంశాలు వెలుగు చూశాయి. దీనిపై త్వ‌ర‌లో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరారు.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: