రేవంత్ టాక్స్ : ఆత్మ గౌర‌వ కాంగ్రెస్ ! ఇదే!

RATNA KISHORE
తెలంగాణ వాకిట స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఒక‌టి  అమ‌లు చేయాల‌ని రేవంత్ భావిస్తున్నారు. ఆ విధంగా ఆయ‌న ముందు కు పోవాల‌ని యోచిస్తున్నారు. ఇది త‌ప్పు కాదు పార్టీకి ఉప‌యోగ‌ప‌డే ప‌ని కానీ కేసీఆర్ పై ఆయ‌న నిర్మాణాత్మ‌క రీతిలో విమ‌ర్శ లు చేయ‌లేక‌పోతు న్నారు అన్న‌ది ఢిల్లీ రాజ‌కీయ రంగ ప‌రిశీల‌కులు చెబుతున్న మాట.


............గులాబీ దండు ప్రశ్న ఇది
వేళ్ల‌కు ముళ్లు గుచ్చుకుంటాయ్ జాగ్ర‌త్త

 తెలంగాణ తీసుకురావ‌డంలో రేవంత్ పాత్ర లేదు. ఆ రోజు ఆయ‌న చంద్ర‌బాబు దగ్గ‌ర ప‌నిచేస్తున్న లీడ‌ర్. ఇంకా చెప్పాలంటే ఆయ న ఏం చెబితే అది చేసిన లీడ‌ర్ ..ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అన్న‌ది గులాబీ దండు ప్రశ్న. మాట్లాడితే, మాట్లాడ‌నీ కా నీ అమ‌రుల కోసం వారి సంక్షేమం కోసం ఏనాడ‌యినా రేవంత్ చేసింది ఏంటి? అది కూడా వ‌ద్దు ఆత్మ గౌర‌వ నినాదం ఎవ‌రికి ఎవ రు అందించాలి? ఇవే ప్ర‌శ్న‌లు గులాబీ గూటి నుంచి వ‌స్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా రేవంత్ మాట్లాడిన మాట‌లు పెను చ‌ర్చ‌ల‌కు దా రి ఇవ్వ‌వ‌చ్చు. ఏఐసీసీ బాస్ రాహుల్ తో భేటీ త‌రువాత తెలంగాణ‌కు పెద్ద స‌మ‌స్య క‌ల్వ‌కుంట్ల కుటుంబమే అని తేల్చ‌డం బాగానే ఉన్నా ఆ స‌మ‌స్య‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ ఎలా అవుతుందో చెప్ప‌లేక‌పోవ‌డంలో రేవంత్ విఫ‌లం అయ్యార‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట. రేవంత్ గెలిచినా, ఓడినా ఆత్మ‌గౌర‌వం అన్న ప‌దం వాడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటే, గ‌తంలో ఆయ‌న చేసిన ప‌నులు త‌వ్వి తీయాల‌ని కొంద‌రు అంటున్నారు.
.......ఇదే సంద‌ర్భంలో
ఇవే మాట‌ల విశ్లేష‌ణ‌లో
గౌరవ కాంగ్రెస్ అని రాయ‌డం క‌న్నా ఆత్మ గౌర‌వ కాంగ్రెస్ అని రాయ‌డంలో అర్థం ఉంది. ఆ విధంగా రాయ‌డంతోనే ఢిల్లీలోనూ మం చి పేరు వ‌స్తుంది. తెలంగాణ‌లో కూడా కాంగ్రెస్ కు ఆత్మ గౌర‌వంతో పాటు ఆత్మ నిబ్బ‌రం కూడా అవ‌సరం అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు తేలిపోతున్న త‌రుణాన రేవంత్ కేసీఆర్ మ‌తి స్థిమితం లేదు అని చెప్ప‌డం త‌ప్పు అని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కేసీ ఆర్ కానీ కేటీఆర్ కానీ తెలంగాణ నిర్మాణంలో త‌ప్పులు చేశారా? అలా అయితే ఆ త‌ప్పులు చెప్పాలి రేవంత్ మీరు.. వారికి మ‌తి స్థి మితం ఉన్నా లేక‌పోయినా మీరు ఆ స్థితికి పోకూడ‌దు అని కూడా జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు..కొంద‌రు గులాబీ దండు శ్రేయోభి లాషులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: