ఆప‌రేష‌న్ రేవంత్ : బీజేపీ మోకాళ్ల నొప్పులకు కాంగ్రెస్ ట్రీట్మెంట్ ?

RATNA KISHORE
న‌డిచేవాళ్లు న‌డ‌వండి
అరిచేవాళ్లు అర‌వండోయ్
అర‌వండి ఇదీ రాజకీయం

 


బండి, ఈటెల ఈ ఇద్ద‌రూ తెలంగాణ‌లో క‌ష్ట‌ప‌డుతున్న లీడ‌ర్లు. పాద‌యాత్ర చేసి అనారోగ్యం పాల‌య్యాడు ఈటెల‌. అలుపూ, సొలు పూ లేకుండా న‌డిచి, సంగ్రామ యాత్ర చేస్తూ నిర్వ‌హించి పార్టీ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేశాడు బండి. ఉహూ! కొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు బండి. వీళ్లంద‌రి క‌న్నా పార్టీని బ‌లోపేతం చేసిన కిష‌న్ రెడ్డి ఏమ‌యిపోవాలో మ‌రి. వీళ్లంద‌రి క‌న్నా పార్టీ విష‌య‌మై ఎ న్నో పాట్లు ప‌డిన నేత‌లున్నారు వారంతా ఏమ‌యిపోయారో కూడా అర్థం కావ‌డం లేదు. ఏదేమ‌యినా ఈ ఏడాదంతా న‌డిచే ప‌ని లేదు కానీ హుజురాబాద్ ఎన్నిక‌ల వ‌ర‌కూ న‌డ‌వాలి.


అలా న‌డిస్తే ఈటెల న‌మ్ముతాడు బండిని. అలా న‌డిస్తే పార్టీ కూడా న‌మ్ము తుంది సంజ‌య్ ను.. ఇలా న‌డ‌వ‌డం వ‌ల్ల ఆరోగ్యం వ‌స్తుంద‌ని ఓ మాట విప‌క్షం అంటోంది. ఇలా న‌డ‌వ‌డం వ‌ల్ల అధికారం రాదు అ ని గులాబీ మాస్ట‌ర్ కేటీఆర్ అంటున్నారు. ఇలా న‌డ‌వ‌డం వ‌ల్ల  ఏమ‌యినా ప్ర‌యోజ‌నం ఉందా లేదా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతుకులాట‌లో ఉన్నారు కొంద‌రు. బండిని న‌మ్మే ప్ర‌య‌త్నం ఎవ్వ‌రు చేయాలి కాంగ్రెస్ కాదు క‌దా చేయాల్సింది బీజేపీనే చేయాలి.


చేస్తుందా? ఏమో మ‌రి! న‌డిచే వాళ్ల‌కు మోకాళ్ల నొప్పులు వ‌స్తాయి అని రేవంత్ ఢిల్లీలో అన్నాడు. న‌డిచే వాళ్ల‌కు, అరిచే వాళ్ల కు కూడా క‌ష్ట‌కాలమే ఇప్పుడు! ఎందుకంటే హుజురాబాద్ ఎన్నిక‌లు దీపావ‌ళి త‌రువాతే అని తేలిపోయింది. ఎంత న‌డిచినా అధికారం ద‌క్క‌దు అని రేవంత్ జోస్యం చెప్పాడు. అలా న‌డ‌వ‌డం ఆరోగ్యం అని డాక్ట‌ర్లు అంటున్నారు స‌రే కానీ రాజ‌కీయంగా ఫ‌లితం లేద‌ని రేవంత్ తేల్చేశాడు. ఇదీ బీజేపీ నొప్పుల‌కు రేవంత్ ట్రీట్మెంట్ ఎపిసోడ్.ఏదేమైన‌ప్ప‌టికీ దీపావ‌ళి వ‌ర‌కూ కాంగ్రెస్, బీజేపీ యుద్ధం ఉంటుందో ఉండ‌దో కానీ ఈ లోగానే ఏ మ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు అన్న‌ది ఢిల్లీ టాక్  

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: