వానొచ్చె - వరదొచ్చె : కేటీఆర్ సిరిసిల్లకు వెళ్లరా?

RATNA KISHORE
స‌మ‌స్య అంటే క‌దిలివ‌చ్చే గుణం ఏమ‌యిపోయిందో కానీ ఈ సారి కేసీఆర్, కేటీఆర్ ఇద్ద‌రూ ఫెయిల్ అయ్యారు. పేద‌ల‌కు బువ్వ అందించ‌డంలో,  బాధిత శ్రేణుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంలో  ఎందుక‌నో అస్స‌లు శ్ర‌ద్ధ వ‌హించ‌డం లేదు.  ఎన్న‌డూ లేనిది బాధిత ప్ర‌భావిత ప్రాంతాల‌కు నాయ‌కులు వెళ్ల‌కుండా, వారితో మాట్లాడ‌కుండా భాగ్య న‌గ‌రం నుంచి మాట్లాడాల‌నుకోవ‌డంలో ఏమ‌యినా
కొత్త‌ద‌నం ఉందా స‌ర్? తెలియ‌దు కానీ ఓ ప్ర‌భుత్వం ఇంత‌టి బాధ్య‌తా రాహిత్యంతో ఉండ‌డం త‌గ‌ద‌ని కొన్ని రాజ‌కీయ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కేసీఆర్ అనే కాదు  మిగ‌తా నాయ‌కులు కూడా త‌మ మాన‌వ‌త‌ను చాటాలి. బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాలకు త‌ర‌లించాలి. కేటీఆర్ కానీ ఆయ‌న మ‌నుషులు కానీ ప్ర‌భావిత ప్రాంతాల‌లో చేప‌ట్టిన లేదా చేప‌ట్టాల‌నుకుంటున్న చ‌ర్య‌లేవీ స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌లేదు.
సామాజిక మాధ్య‌మాల్లో స్పందించే కేటీఆర్ క్షేత్ర స్థాయి సాయాల‌కు మాత్రం ముందుకు రావ‌డం లేదు. ఆన్లైన్ ప‌ర్య‌వేక్ష‌ణ కార‌ణం గా ప‌నులు జ‌ర‌గ‌వు అని తెలిసి కూడా ఎందుక‌నో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌కు ఆయ‌న పోవ‌డం లేదు. అధికారుల‌ను హైద్రాబాద్ నుంచి మాట్లాడి ఉరుకులు, ప‌ర‌గులు పెట్టిస్తే ప‌నులు అవుతాయి అన్న ఆలోచ‌న ఎందుక‌నో ఆయ‌న చేస్తున్నారు. ఇవేవీ భావ్యం కాదు..అని విప‌క్ష పార్టీలు అరిచి గోల చేస్తున్నాయి.

తెలంగాణ లో సీఎం త‌రువాత సీఎం. తిరుగులేని ఛార్మింగ్ ఉన్న నేత. ఐటీ శాఖ‌ను పుర‌పాల‌క శాఖ‌ను ఏక కాలంలో న‌డిపిస్తున్న వ్యక్తి..కేటీఆర్. నాన్న త‌రువాత అంత‌టి స్థాయిలో పార్టీని న‌డిపించ‌గ‌ల స‌త్తా ఉన్న నేత. ఉన్నంత‌లో కొన్ని విష‌యాల్లో అయినా మిగ‌తా నాయ‌కుల క‌న్నా ప‌రిప‌క్వ‌త ఉన్న నేత. ఆయ‌న మాట శాస‌నం అని అన‌లేం కానీ శాస‌నంగా మ‌లుచుకుంటే బాగుంటుం ది. అప్పుడు కేసీఆర్ క‌న్నా కేటీఆర్ ఇంకాస్త గొప్ప‌వాడు అవుతాడు. గొప్ప‌ల క‌హానీ ఎలా ఉన్నా ఈ సారి కేటీఆర్ త‌న పంథా మా ర్చారు. పాల‌క వ‌ర్గంలో ఉంటుండగా ఆయ‌న ఎందుక‌నో ప్ర‌జ‌ల స‌మ‌స్యలు పరిష్కారం మ‌రిచిపోయి, సొంత ప‌నులను చ‌క్క‌దిద్దు కోవడంలో కాలం వెచ్చిస్తున్నారు. పేరుకు సిరిసిల్ల ఎమ్మెల్యే కానీ ఆయ‌న అటు చూడ‌రు అటు స‌మ‌స్య‌లు ఇటు రానివ్వ‌రు విన‌రు ...వినిపించుకోరు అన్న‌వి ఆయ‌న‌పై విప‌క్ష శ్రేణులు చేస్తున్న ఆరోప‌ణ‌లు. వరుస వాన‌లూ, అటుపై వ‌ర‌ద‌లు తెలంగాణ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. జ‌ల విల‌యం ఒక‌టి త‌రుముకొస్తుంది. ఇటువంటి విప‌త్తు స‌మ‌యాల్లో బాధితుల‌కు కేటీఆర్ నేరుగా క‌ల‌వాలి. కానీ క‌ల‌వ‌లేదు. గులాబీ పార్టీ స‌మావేశాలు ర‌ద్దు చేయాలి కానీ ర‌ద్దు చేయ‌లేదు. క‌నీసం ఆయ‌న చెప్పిన మాట‌లు అమ‌లు అయ్యేలా చూడాలి. ఇవేవీ జ‌ర‌గ‌లేదు. జ‌ర‌గ‌వు కూడా! తాము ప‌నిచేయ‌కున్నా జ‌నం ఓట్లేస్తారు అన్న భావ‌న‌కు బ‌హు శా! ఆయ‌నొచ్చారేమో! లేదా ఇంకేమయినా మ‌న‌సులో దాచుకున్నారేమో కానీ కేటీఆర్ అస్స‌లు ఇటుగా చూడ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: