టీఆర్ఎస్‌-బీజేపీ దోస్తానా రేవంత్‌కు అస్త్రంగా మార‌నుందా.?

Paloji Vinay
హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా ప‌డ‌డం ద్వారా బీజేపీకి ముఖ్యంగా ఈట‌ల‌కు ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అలాగే ఉప ఎన్నిక‌ల‌ను సీఎం కేసీఆర్ వాయిదా వేయించార‌నే ప్ర‌చారం సాగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదాతో టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుంద‌ని దీంతో పార్టీలో ఉన్న లోపాల‌ను స‌రిచేసుకునేందుకు వీలు ఉంటుంద‌ని భావిస్తున్నారు ఆ పార్టీ వ‌ర్గీయులు. దీంతో గ్యాప్ పెర‌గ‌డం ఈట‌లపై మాన‌సికంగా ప్ర‌భావం ప‌డుతుంద‌ని అలాగే మోడీ కేసీఆర్ ఒక‌టేన‌నే ఈట‌ల‌కు అవ‌గ‌తం కావ‌డంతో ఆయ‌న బ‌ల‌హీన‌ప‌డ‌డ‌మే సీఎం కేసీఆర్ ప్లాన్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

    అదే విధంగా ఇటు హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదాతో టీపీసీసీ చీఫ్ రేవంత్ ఊపిరి పీల్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టికే టీఆర్ఎస్‌, బీజేపీ లు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. కానీ కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని ఎంపిక చేసే విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూ తీవ్ర ఒత్తిడికి లోన‌య్యార‌ట‌. ఇప్పుడు ఉప ఎన్నిక‌కు ఇంకా స‌మ‌యం దొర‌క‌డంతో అభ్య‌ర్థి ఎంపిక విష‌యంతో పాటు ప్ర‌చారంలో దూసుకెళ్లొచ్చ‌ని రేవంత్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక‌ మోడీతో కేసీఆర్ భేటీ కావ‌డంతో టీఆర్ఎస్ - బీజేపీ ఒక్క‌టేన‌ని ఆయుధాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డికి అవ‌కాశం దొరికిన‌ట్టు తెలుస్తోంది.

   ఇన్నాళ్లు శ‌తృవులుగా బీజేపి - టీఆర్ఎస్ న‌టించార‌ని, మోడీ - కేసీఆర్ భేటీ అలాగే కావ‌డంతో దీంతో పాటు కేసీఆర్ కోరిక మేర‌కు హుజురాబాద్ ఎన్నిక‌ను వాయిదా వేశార‌ని దీని వ‌ల్ల వారి స్నేహం బ‌హిర్గ‌త‌మ‌యింద‌ని ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌తో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న కారు పార్టీ, కాషాయ ద‌ళం ను ఎదుర్కొనేందుకు అస్త్ర శ‌స్త్రాలు సిద్దం చేసుకునేందుకు రెడీ అవుతున్నార‌ట‌.
   
    హుజురాబాద్ ఎన్నిక త‌మ‌కు చిన్న విష‌యం అని చెప్పిన కేటీఆర్ మాట‌ల‌తో ఓట‌మిని అంగీక‌రించార‌ని అనుకుంటున్నారు అంతా. అలాగే ఈటల వ‌ర్గీయుల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటూ బ‌ట‌హీన ప‌రుస్తున్నారు. దీంతో అనుకోకుండా దొరికిన ఆయుధాన్ని స‌రిగ్గా ఉప‌యోగించుకునేందుకు రేవంత్ అండ్ కో కంపెనీ వ్యూహాలు ర‌చిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: