కాంగ్రెస్ కు కలిసిసోచ్చిన కేసీఆర్ నిర్ణయం..! ఏమిటది..?

MOHAN BABU
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రేవంత్ రెడ్డి టీ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత  కాంగ్రెస్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే  హుజురాబాద్ ఉప ఎన్నిక రావడం రాజకీయ పార్టీలన్నీ హుజురాబాద్ చుట్టే తిరగడం జరుగుతోంది. అయితే అన్ని పార్టీలు  హుజురాబాద్ మాకు ముఖ్యం కాదని చెబుతూనే ఆ ఎన్నిక  కోసం తీవ్రంగా ఖర్చు పెడుతున్నారు. అయితే హుజురాబాద్ లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని  పార్టీలన్నీ ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే అధికార తెరాస పార్టీ  తన వ్యూహాలను అమలు చేస్తూ  ముందుకు సాగుతోంది  అలాగే బీజేపీ పార్టీలో చేరిన టువంటి ఈటల రాజేందర్ తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటన చేస్తున్నారు.

దీనికి తోడు హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి, టిఆర్ఎస్ ఎంత దూకుడుతో ఉన్నాయో చూస్తే, కాంగ్రెస్ పార్టీ  చాలా వెనకబడి పోయిందని చెప్పవచ్చు. కనీసం కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరో కూడా పార్టీ శ్రేణులు ప్రకటించకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారినది. కాంగ్రెస్ కావాలనే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందని ప్రచారం కూడా జరుగుతోంది. కారణాలు ఏదైనా ఉపఎన్నిక మరో రెండు మూడు నెలల వరకు వాయిదా పడి ఉంటుందని ఇది  కాంగ్రెస్ పార్టీకి, కలిసొచ్చే విషయమని చాలా ప్రచారం జరుగుతోంది. టీ పిసిసి పదవికి కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి  ఈ యొక్క ఉప ఎన్నిక మొదటిది కాబట్టి ఆయన ఎలాగైనా దీన్ని గెలిపించాలని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మంచి ఫలితం సాధిస్తేనే రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికోసమే కొండా సురేఖను కూడా బరిలో నిలిపేందుకు ఒప్పించారని  సమాచారం.

అయితే ఈ ఉప ఎన్నిక మరి కొన్ని రోజుల తర్వాత జరుగుతుండడంతో రేవంత్ రెడ్డి హుజురాబాద్ విషయాన్ని పక్కన పెట్టేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. టిపిసిసి బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకుకృషి చేస్తున్నారు. అనుకోకుండా ఈ ఉప ఎన్నిక వాయిదా పడడం, ఆయనకు మరికొంత సమయం దొరకడం వల్ల  ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కసరత్తు   చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: