గులాబీ వనంలో ! : హుజురాబాద్ ను పట్టించుకోడు కేటీఆర్ ?

RATNA KISHORE

ఎగిరి ప‌డుతున్న నాయ‌కులు అంటే ఎవ‌రు స‌ర్?
ఇవాళ మీరు చెప్పిన నాయకులు వారి అనుచ‌రుల
క్యూలు, ఐ క్యూలు అన్నీ మీవే క‌దా!
మ‌రి! ఎందుకు వారిని కించ‌ప‌రుస్తున్నారు..
ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం ఉంచుకోవ‌డంలో త‌ప్పు ఏమీ లేదు అండి
మీ ద‌గ్గ‌ర నుంచి వెళ్లినంత మాత్రాన వారి చ‌రిత్ర త‌ప్పుల‌తో నిండిపోయిందా?
అంతేనా! త‌న‌కు అస్స‌లు హుజురాబాద్ ఎన్నికే చాలా చిన్న ఎన్నిక అని తేల్చ‌డం వెనుక ఆయ‌నకున్న అవ‌గాహ‌న క‌న్నా, అతి విశ్వాస ధోర‌ణే ప్ర‌స్ఫుటం అవుతోంది. 



చాలా స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు కేటీఆర్ అలా ఉండ‌డంలో ఆనందం ఉంది. విచారం కూడా ఉంది. స్ప‌ష్ట‌త పాల‌నపై ఉంటే బాగుంటుంది. కానీ అంత‌కుమించిన విష‌యాల‌పై ఆయ‌న‌కు చాలా స్ప‌ష్ట‌త ఉండ‌డం కాస్త గంద‌ర‌గోళ‌మే. ఎన్నిక ఏద‌యినా మాదే గెలుపు అని బాల‌య్య రేంజ్ లో డైలాగ్ కొట్ట‌డంతోనే ఆయ‌న స్ప‌ష్ట‌త తేలిపోయింది. కొంద‌రు నాయ‌కులు ఎగిరెగిరి ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానిం చ‌డం కూడా త‌ప్పే! విప‌క్షాల‌ను ఉద్దేశించి ఆయ‌న ఈ మాట‌లు చెప్పి, అదేవిధంగా ప్ర‌జ‌లు త‌మ‌పై ఏ విధంగా న‌మ్మ‌కం ఉంచుతు న్నారో అన్న‌ది కూడా చాలా అంటే చాలా విశ్వాసంతో చెప్ప‌డం ఆయ‌నకు ఉన్న స్ప‌ష్ట‌త‌కు సంకేతం.


మీకు తెలుసా హుజురాబాద్ ఎన్నిక‌ల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేదు. కేటీఆర్ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అస‌లు అది వారి దృష్టిలో ఎన్నికే కాదు..చాలా సింపుల్ మేట‌ర్. దీని కోసం 1200 కోట్ల రూపాయ‌ల‌తో ద‌ళిత బంధు ప‌థ‌కం ఎందుకు తీసుకువ‌చ్చా రని ఇది మాత్రం అడ‌గ‌వొద్దు ప్లీజ్! ఎందుకంటే వారికి ఇవేవీ ప‌ట్ట‌వు. వారికి గెలుపూ ఓట‌మీ అన్న‌వి ప‌ట్ట‌వు..హాయిగా రాజ‌కీయా లకు అతీతంగా మాట్లాడ‌డం మాత్ర‌మే తెలుసు. అందుకే కేటీఆర్ హుజురాబాద్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అదేమంత త న ప‌రిధిలో లేని విష‌య‌మూ కాదు. అవ‌న్నీ హ‌రీశ్ రావు మాత్ర‌మే చూసుకుంటారు అన్న ధోర‌ణిలో ఆయ‌న ఇవాళ జ‌ల‌విహార్ లో జ‌రిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశాన మాట్లాడ‌డం ఆశ్చ‌ర్య‌దాయ‌కం. సంభ్ర‌మాశ్చ‌ర్యదాయ‌కం అని రాయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: