గులాబీ వనంలో ! : కాలనీ ఎన్నికలు కూడా వదలడు కేటీఆర్?

RATNA KISHORE
గ్రేట‌ర్ ఎన్నిక‌లు రాలేదు
కానీ క‌మిటీల నియామ‌కం
మాత్రం కావాలి
అందుకనో ఎందుక‌నో
బ‌స్తీల‌పై కూడా కేటీఆర్ దృష్టి ఉంది
కాల‌నీల అసోసియేష‌న్ల కు సంబంధించి
కూడా కొన్ని క‌మిటీల నియామ‌కం అయితే
సైన్యం నిర్మించ‌వ‌చ్చు.. అన్న‌ది యువ‌రాజా థీసీస్


ప్ర‌తిరోజూ ఎన్నిక‌ల కోసమే క‌ల‌వ‌రించే పార్టీలు ఎన్న‌యినా ఈ దేశంలో ఉండొచ్చు. ప్ర‌తిరోజూ గెలుపున‌కు ఎవ‌రిని క‌లుపుకుని పోవాలో అన్న ఆలోచ‌న ఒక‌టి ప్ర‌తి నాయ‌కుడిలోనూ ఉంటుంది. అది కూడా త‌ప్పు కాదు. గ్రేట‌ర్ ప‌రిధిలో 4,800 అసోసియేష‌న్లు ఉన్నాయి. వీటికి క‌మిటీల నియామ‌కం కావాలి. అవి కూడా త‌మ‌వారివే కావాలి..త‌మ వారికే కావాలి..అని రాయాలి. అదేవిధంగా బ‌స్తీలున్నాయి వాటికి కూడా క‌మిటీలు ఉండాలి. ఉంటేనే మేలు. త‌మ వారికి మేలు..త‌న అనుకున్న వారికి మేలు..త‌ప్ప‌క జ‌రుగుతుంది అని కేటీఆర్ భావ‌న కావొచ్చు.


1486 బ‌స్తీలకు క‌మిటీలు వేయండి.. ఈ ప‌ని కూడా కాల‌నీ అసోసియేష‌న్ల‌కు క‌మిటీ లు నియ‌మించిన విధంగానే ఈ  నెల ఇర‌వైలోగా పూర్త‌యిపోవాలి. ఈ విధంగా ఆయ‌న ల‌క్ష‌ల్లో సైన్యాన్ని వేల‌ల్లో నాయ‌కుల్ని వంద‌ల్లో త‌న నేతృత్వంలోని కొంద‌రికి కొన్ని ప‌ద‌వుల్ని ఇలా ఇచ్చి చూడాల‌ని యువ‌రాజా ఆలోచ‌న‌! ఇదీ గులాబీవనంలో విక‌సిత ప‌రిణామం. వికాసం ఎలా  ఉన్నా అనుకూల ప‌రిణామాలు ఎలా ఉన్నా  కేటీఆర్ విశ్వాసం అన్న‌దే ఇప్పుడిక ప్ర‌ధానం. ఆ విశ్వాసం అవిశ్వాసాల‌కు కార‌ణం కాకుంటే చాలు.


ఎన్నిక‌లు ఏవ‌యినా ఎన్నిక‌లే..జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే కాదండి ఓ కాల‌నీ అసోసియేష‌న్ ఎన్నిక‌లు కూడా ఎన్నిక‌లే. క‌నుక ప్ర‌తి ఎన్నిక కూడా కేటీఆర్ కు అవ‌స‌ర‌మే. క‌మిటీల ఏర్పాటు కూడా ఆయ‌న‌కు క‌లిసొచ్చే అవ‌కాశ‌మే. అనుకూల క‌మిటీలు ఉంటే అనుకూల ఫ‌లితాలు ఉంటాయి అన్న‌ది ఆయ‌న న‌మ్మ‌కం. అందుకే గ్రేట‌ర్ హైద్రాబాద్ ప‌రిధిలో శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేసేందుకు ఇవాళ ఆయ‌న ఉద్వేగ భ‌రితంగా మాట్లాడారు. విప‌క్షాల‌ను ఎప్ప‌టిలానే కాసేపు తిట్టి, తాము చేస్తున్న మంచిని ఓర్వ‌లేక కొంద‌రు అతి చేస్తున్నార‌ని అన్నారు. అంటే అన్నారు కాల‌నీల లెక్కేంటి?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: