గులాబీ వనంలో ! : ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లో కేటీఆర్ ?

RATNA KISHORE
ప్ర‌జ‌లంతా సుభిక్షంగా ఉన్నార‌ని కేటీఆర్ మ‌నోగ‌తం.. అభిప్రాయం కూడా ఇదే! తెలంగాణ రాష్ట్ర స‌మితి పాల‌న‌తో అన్ని వ‌ర్గాలూ ఆనందంగా ఉన్నాయ‌ని కూడా అన‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా చూసిన విష‌యం అయితే అంగీకార యోగ్య‌మే. కానీ క్షేత్ర స్థాయి వాస్త‌వాలు మ‌రిచి, ఇలా మాట్లాడితే మాత్రం అది అంగీకారం కాదు.


కేసీఆర్, కేటీఆర్ ఒకేవిధంగా మాట్లాడుతున్నారు. విప‌క్షాల‌పై గొంతు ఒకే విధంగా వినిపించి, వారి మాట‌ల‌ను ప‌రిగ‌ణించాల్సిన అవ స‌ర‌మే లేద‌ని అంటున్నారు. తెలంగాణ వాకిట ఇంటి పార్టీకి ఆత్మ విశ్వాసం పోయి అతి విశ్వాసం వ‌చ్చిందా అన్న సందేహాలు పు ట్ట‌క మాన‌వు. ఇంత‌కాలం ఇంటి పార్టీ  నుంచి ఇటువంటి వ్యాఖ్య‌లు  వ‌చ్చినా కూడా పెద్ద‌గా ప‌ట్టింపు ఉండేది కాదు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యాన కేటీఆర్ కూడా ఇదే వాణిలో మాట్లాడుతున్నారు. హై పిచ్ లో మాట్లాడితేనే తాము నెగ్గుకువ‌స్తామ‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారా? లేదా ఇదే ప‌ద్ధ‌తిలో మాట్లాడ‌క‌పోతే రాజ‌కీయాల‌లో  మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌ని ఆయ‌న భావిస్తున్నారా?


జ‌ల‌విహార్ లో ఇవాళ కేటీఆర్ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రిగింది. ప్ర‌తిప‌క్షాల‌పై ఇవాళ కూడా నిప్పులు చెరిగారు కేటీఆర్. రాష్ట్రంలో ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉన్నార‌ని, అది చూసి ఓర్వ‌లేకే ప్ర‌తిప‌క్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నాయ‌ని అన్నారు. ఇంత‌కాలం అధికారంలో ఉన్నామ‌ని ఆగామ‌ని, ఇక‌పై మరింత మాట‌ల దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని కూడా ఆయ‌న శ్రేణుల‌కు చెప్పారు.


కేటీఆర్ మాట‌లు విన్నాక ఇంత‌కాలం విప‌క్షాల‌పై కోపం ఒక్క‌టే ఉందా లేకా ఇంకేమయినా ఉద్దేశాలు మ‌న‌సులో ఉన్నాయా అన్న వి కూడా తేల‌క మాన‌వు. ఒక సందిగ్ధ స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంద‌ని, దానిని పైకి చెప్పుకోలేక పార్టీపై విశ్వాసం పోగొట్టుకోకుం డా ఉండేందుకు అప్పుడ‌ప్పుడూ అయినా ఇలాంటి స్పీచులు ఇస్తుండాలి అని కొంద‌రు విప‌క్ష స‌భ్యులు కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ కంటెంట్ ఏమ‌యినా ప్ర‌తిప‌క్షాల‌ను తిట్ట‌డం అదే ప‌నిగా తిట్ట‌డం అన్న‌వి అస్స‌లు మంచి ప‌ని కాద‌ని, ప్ర‌జాస్వామ్య రాజ్యంలో పాల‌కుల హుందాత‌నం అన్న‌దే ముఖ్య‌మని కొంద‌రు హిత‌వు చెబుతున్నారు. స‌భ‌లు జ‌రుగుతున్న వేళ విప‌క్షాలు సైతం కేటీఆర్ ను తిట్ట‌డం కూడా మంచి సంకేతాలు ఇచ్చిన‌ట్లు కాద‌ని కూడా అంటున్నారు. కేటీఆర్ మాత్రం ఈ రోజు త‌మ‌కు విప‌క్షాల మాటే ప‌ట్టింపు లేద‌ని చెప్ప‌డం, శ్రేణులు కూడా ఇక‌పై మాట‌ల దాడి చేయ‌మ‌ని చెప్ప‌డం అన్న‌వి ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో గులాబీ దండుకు అవ‌స‌రం అయిన ప‌నులు కావొచ్చు. కానీ వ‌ర‌ద‌ల వేళ పొంగుకొస్తున్న జ‌ల విల‌యం చెంత పుర‌పాల‌న మ‌రిచి విస్తృత స్థాయి స‌మావేశాల‌కు కాలం వెచ్చించి ఓ మంత్రి ఇలా మాట్లాడ‌డం స‌బ‌బు కాదు అన్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: