బండి మొదటి బక్రా... ఈటెల రెండు... అమిత్ షా ముందు కేసీఆర్ ఎందుకు అలా..?

Gullapally Rajesh
కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నాడు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బండి సంజయ్  ఓ డమ్మీ, ఢిల్లీ బీజేపీ నాయకత్వం బండి ని బకరా చేసింది అని ఆయన ఎద్దేవా చేసారు. పార్లమెంట్ సీట్లు తగ్గితే ఎలా అని ముందుగానే బీజేపీ  , టీఆరెస్ మిలాఖత్ అయ్యాయి అన్నారు ఆయన. అమిత్ షా వద్ద కేసీఆర్ కాలుమీద కాలేసుకుని కూర్చోవడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ  కేసీఆర్ కు అంతర్గత సంబంధాలు వున్నాయ్ అని అన్నారు.
రాహుల్ గాంధీని కొత్త పీసీసీ కమిటీ కలవబోతుంది అని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక.. పీసీసీ కమిటీ రాహుల్ ను కలవాలని మొదటి రోజే అనుకున్నాం అని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల కిందనే అపాయింట్ మెంట్ అడిగాం అని రేపు టైం ఇచ్చారు.. రాహుల్ గాంధీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నేను వెళ్తానా లేదా అనేది చెప్పలేను అన్నారు ఆయన. సీఎం ఢిల్లీ కి వెళ్లి ప్రధాని, మంత్రులను కలిశారు.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అని ఆయన ఎద్దేవా చేసారు. కానీ సమస్యలపై వినతి పత్రం ఇచ్చినట్లు ఫొటోలున్నాయా..? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాకుండా టీఆరెస్ ను బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది అని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర బీజేపీ  నాయకులు డమ్మీలు అని ఎద్దేవా చేసారు. బండి సంజయ్ బక్రా ను చేసిండ్రు అని వాళ్ళ పార్టీ నేతలే అలా చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. పాపం ఈటెలను రెండో బక్రా చేశారు అన్నారు. అమిత్ షా డైరెక్షన్ లోనే ఇది జరుగుతుంది అన్నారు. సెప్టెంబర్ 17 న గాంధీ భవన్ లో జాతీయ జెండా ఎగరవేస్తాం అన్నారు ఆయన. మతాలను, కులాలను బీజేపీ  , ఎంఐఎం రెచ్చగొడుతోంది అని ఈ సందర్భంగా ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో వర్షాలకు వేల ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: