ప్ర‌కృతి ప‌రీక్ష : ఎవ‌రు పాస్ ? ఎవ‌రు ఫెయిల్ ?

RATNA KISHORE

ఎవ‌రు హీరోలు అన్న‌ది
వ‌ర‌ద‌లూ విప‌త్తులూ ఉన్న వేళే తేలిపోతుంది
టీఆర్ఎస్ ది మాట‌ల గారడి అని బీజేపీ అన్నా
బీజేపీ ఇచ్చింది నిండు సున్నా అని బండిని ఉద్దేశించి
గులాబీ దండు అన్నా ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు ఊతం ఇచ్చేవే కావు
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సంజ‌య్‌, అర‌వింద్, కిష‌న్ రెడ్డి లాంటి నేత‌లు భాగ్య న‌గ‌రితో పాటు తెలంగాణ ప్ర‌తినిధులుగా ఉన్నారు. ఈ స‌మ‌యంలో కేంద్రం నుంచి సాయం రావాలి. త‌క్ష‌ణ సాయం అని రాయాలి. అది వ‌స్తుందా ముంపు ప్రాంతాల‌కు అం దేది ఎంత‌? ఆర్థిక చేయూత అన్న‌ది లేకుండా ఈ స‌మ‌యంలో ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు చేయూత ఇవ్వ‌కుండా బీజేపీ ఏం చె ప్పినా ఫ‌లితం ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయి ఉన్నాయి. ఈ స‌మ‌యంలో విపత్తు నివార‌ణ బృందాల ప‌ని తీరు, వాటిని వినియోగించుకునే ప‌ద్ధ‌తి అన్న‌వి కీల‌కం. కానీ సీన్ లో కేసీఆర్ లేరు. కేటీఆర్ కూడా లేరు. క్షేత్ర స్థాయిలో  నాయ‌కు లు లేకున్నా ప‌నులు జరిగిపోతాయి అని అనుకోవ‌డ‌మే అతి పెద్ద అవివేకం. వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్న స‌మ‌యాన మాన వతా దృక్ప‌థంతో ప‌నిచేసే నేత‌లే నిజ‌మయిన హీరోలు. మ‌రి! ఎవ‌రు హీరోలు ?

వ‌ర్షాలు భారీగా కురిసి, తెలంగాణ‌ను ముంచెత్తుతున్న స‌మ‌యాన ఎన్నో బాధిత హృద‌యాలు సాయం కోసం ఎదురు చూస్తున్నా యి. కేసీఆర్ ఫోన్లో మాట్లాడినంత మాత్రాన స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. కేటీఆర్ టెలికాన్ఫ‌రెన్స్ లో సూచ‌న‌లు ఇచ్చినంత మాత్రాన స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం కావు. అయిన‌ప్ప‌టికీ ఏదో చిన్న ఆశ. వీళ్ల స్పంద‌న‌కు అనుగుణంగా అధికారులు క‌దిలివస్తార‌ని.. ఏటా ప్ర‌కృతి విప‌త్తుల‌తో స‌త‌మ‌తమయ్యే తెలుగు రాష్ట్రాల‌లో న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు కానీ అంత‌కుముందు తీసుకుని తీరాల్సిన ప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు కానీ ఏమీ లేవు అన్న‌ది వాస్త‌వం.

కేటీఆర్ సిరిసిల్ల‌కు వెళ్ల‌లేదు. కేసీఆర్ తెలంగాణ‌లో లేరు. కేటీఆర్ కేవ‌లం టెలి కాన్ఫిరెన్స్ కే ప‌రిమితం అయి అధైర్య‌ప‌డ‌కండి అని చెబుతున్నారు. ఇదెంత వ‌ర‌కూ సాధ్యం అవుతుంది అన్న‌ది తెలియ‌దు. వ‌రద తీవ్ర‌త కార‌ణంగా ముఖ్య న‌గ‌రాలలో కొన్ని ప్రాంతా లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. పంట‌ల‌కు సైతం న‌ష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందు కు నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే అదీ సందేహాల‌కు తావిచ్చేదే? ఈ ద‌శ‌లో కేసీఆర్ స‌ర్కారు ఏ విధంగా ప‌నిచేస్తుంది అన్నది అత్యంత ప్రాధాన్య‌తతో కూడిన విష‌యం. వాన‌ల సంద‌ర్భంగా త‌లెత్తిన న‌ష్ట నివార‌ణ‌కు క్షేత్ర స్థాయిలో ఉండాల్సిన నాయ‌కులు ఏమ‌యిపోయారో తెలియ‌దు కానీ ఈ విప‌త్తులో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి టీఆర్ఎస్ గెలుస్తుందా లేదా సాయం చేసి బీజేపీ గెలుస్తుందా అన్న‌ది కీల‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: