గులాబీ వ‌నంలో : ప‌ర్య‌ట‌న‌ల్లో సీఎం వ‌ర‌ద‌ల్లో జ‌నం

RATNA KISHORE
ఇది ఉద్య‌మ పార్టీ కాదు
ప్ర‌జ‌ల పార్టీ కానీ
జ‌ల‌విల‌యాలు వ‌చ్చినప్పుడు
ప్ర‌జ‌ల పార్టీ  కాస్త
ఎటు ఉంటుందో తెలియ‌దు
అన్న విమ‌ర్శ‌కు ప్ర‌ధాన కార‌ణం అవుతోంది



మ‌హా న‌గ‌రాలు జ‌ల విల‌యం కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్నాయి. ఎన్న‌డూ లేనంత వ‌ర్షాలు  ఇక్క‌డ కుర‌వ‌డంతో కాస్తంత కూడా ఊపిరి నివ్వ‌డం లేదు. బాధ్య‌త గ‌ల అధికారులు స‌రే  ప‌నిచేస్తారు..ఒప్పుకోవాలి..కానీ ఏ బాధ్య‌త‌లూ ప‌ట్ట‌ని యంత్రాంగాన్ని క‌దిలిండ‌చంలోనే సిస‌లు బాధ్య‌త దాగి ఉంది. వ‌ర్షాల కార‌ణంగా సీఎస్ రివ్యూలు అయితే చేస్తున్నారు. అవి చాల‌వు. క్షేత్ర స్థాయిలో నాయ‌కులు ఉండాలి. కేసీఆర్ అదే క‌దా చెప్పింది. ప్ర‌భుత్వ పెద్ద అక్క‌డ ఉండిపోవ‌డంతో ఢిల్లీ కేంద్రంగా స‌మాలోచ‌న‌ల్లో త‌ల‌మున క‌లు అవ్వ‌డంతో ఇదే అదునుగా జిల్లా స్థాయిలో నాయ‌కులు ఇళ్ల‌కే ప‌రిమితం అయి మొద్దు నిద్ర న‌టిస్తుండ‌డ‌మే బాధాక‌రం. ఇ ళ్లు పోయి కొంద‌రు, పంట పోయి కొంద‌రు ఏడుస్తుంటే  హైద్రాబాద్ లో ఇవాళ విస్తృత స్థాయి స‌మావేశం పేరిట గులాబీ పార్టీ నాయ కులు కాలం వృథా చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నా ఇవేవీ వినిపించుకునే స్థాయి మాది కాద‌ని విస్తృత రీతిలోనే నాయ‌కు లు అన్న‌వారు చెప్ప‌క‌నే చెప్ప‌డం విశేషం.


బిజీ బిజీగా పెద్దాయ‌న :
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్నారు కేసీఆర్. వ‌రుస భేటీల‌తో కాలం వెచ్చిస్తున్నారు. రాజ‌కీయం వేడి పెంచుతున్నారు. ప‌ర్య‌ట‌న ల కార‌ణంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు పెంచే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు. కేసీఆర్ ఏం చేసినా అదంతా తెలంగాణ కోస‌మే అన్న‌ది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆయ‌న పాత పంథానే కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో స‌మావేశం అయి తెలంగాణ సర్వ‌తోముఖాభివృద్ధికి ఏం చేయాలో అన్న‌దే ఆలోచిస్తున్నారు.


ఇళ్ల‌కే ప‌రిమిత‌మా నాయ‌కులు! :
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగానే అమిత్ షా, గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ వంటి కీల‌క నేత‌ల‌తో భేటీ అ య్యారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న నిర్మ‌ల‌మ్మ‌ను కూడా క‌ల‌వ‌ను న్నార‌న్న సంకేతాలు అందుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా కేసీఆర్ ప‌ర్య‌ట‌న జ‌రుగుతుండ‌గా మ‌రో విపత్తులో తెలంగాణ చిక్కుకుంది. వ‌ర‌ద‌ల్లో ప్ర‌జ‌లు చిక్కుకుపోయి ఉన్నారు. న‌గ‌రాల్లోనే కాదు మారుమూల ప్రాంతాల్లోనూ ఇదే అవ‌స్థ. కానీ ఆయ‌న మాట పాటింపులో అధికారులు ఉన్నార‌ని చెప్ప‌లేం. ఉంటార‌ని నిర్థారించ‌లేం. ఫ‌లితంగా ఆక‌లితో చాలామంది అవ‌స్థ ప‌డుతు న్నారు. ఇళ్లు నీట మునిగి శ‌ర‌ణు వేడుకుంటున్నారు. కేటీఆర్ అయితే హైద్రాబాద్ కే ప‌రిమితం అయితే మిగ‌తా నాయ‌కులూ అలానే ఉన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న మాటెలా ఉన్నా తెలంగాణ‌ను ఆదుకోవాల్సింది ఎవ‌రు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: