రేవంత్ కు కలిసివచ్చిన... సీఎం కేసీఆర్ నిర్ణయం ?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే.... తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు హుజూరాబాద్ నియోజకవర్గం లో పాగా వేశాయి. ఎప్పుడెప్పుడు... హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని.. ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో... కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కరోనా మరియు పండుగల సీజన్ నేపథ్యంలో... ఇప్పుడే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు నిర్వహించడం అని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో బిజెపి పార్టీ.... కెసిఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. 

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్.. ఇలా తప్పుడు నివేదికలు పంపారని బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే... కెసిఆర్ నివేదిక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి.... లాభం గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం తీరు చూస్తూ ఉంటే మరో రెండు నెలల వరకు హుజురాబాద్ ఉప ఎన్నిక లేనట్లే కనిపిస్తోంది. అయితే ఉప ఎన్నిక వాయిదా పడితే అధికార టిఆర్ఎస్ పార్టీ తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కలిసి వచ్చే అంశంగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం... మొట్ట మొదటి గా వస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక ఆయనకు అగ్నిపరీక్షగా మారింది. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నీ విజయం సాధించకపోయినా.. రెండోస్థానంలో నైనా నిలిస్తే రేవంత్ రెడ్డి.... బ్రాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ని ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లిన అప్పటినుంచి... గత ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఈసారి మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తోంది. అయితే ఉప ఎన్నిక కాస్త వెనక్కి జరిగితే... కాంగ్రెస్ పార్టీని హుజరాబాద్ నియోజకవర్గం లో బలంగా తయారు చేయవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడటం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా అందరూ చూస్తున్నారు. ఈ రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకునే విధంగా... రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తే... కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుందని చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: