కొడాలి, వంశీలకు మళ్ళీ ఛాన్స్ ఉందా?

M N Amaleswara rao
కొడాలి నాని, వల్లభనేని వంశీ...కృష్ణా జిల్లా రాజకీయాల్లో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు. ఇద్దరు నాయకులు టి‌డి‌పి నుంచి ఎదిగిన వారే. ఇక ఇప్పుడు వైసీపీలో కీలక నాయకులు మారిపోయారు. అయితే టి‌డి‌పి నుంచి ఈ ఇద్దరు నాయకులకు చంద్రబాబు చెక్ పెట్టలేకపోతున్నారు. వీరికి సొంత ఇమేజ్ ఉండటం వల్ల గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టి‌డి‌పికి పుంజుకునే అవకాశం దక్కడం లేదు. దీని వల్ల భవిష్యత్‌లో మళ్ళీ కొడాలి, వంశీలకు గెలిచే ఛాన్స్ వస్తుందని తెలుస్తోంది.
మామూలుగా గుడివాడ టి‌డి‌పికి కంచుకోట. ఆ కంచుకోటలోనే కొడాలి నాని టి‌డి‌పి నుంచి ఎంట్రీ ఇచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో నాని, జగన్ పెట్టిన వైసీపీలోకి వెళ్ళిపోయారు. అయితే నాని వైసీపీలోకి వెళ్ళిన గుడివాడలో టి‌డి‌పినే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ నాని అప్పటికే సొంత ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. దీంతో ఒకటి కాదు రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచేశారు. ఇప్పుడు మంత్రిగా గుడివాడలో తిరుగులేని బలంతో ఉన్నారు. అటు టి‌డి‌పి తరుపున రావి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నా సరే నానికి పోటీ ఇవ్వలేకపోతున్నారు. దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో నాని మళ్ళీ గెలవడం ఖాయమే అని తెలుస్తోంది.

 
అటు వల్లభనేని వంశీ కూడా టి‌డి‌పి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టి‌డి‌పి తరుపున గెలిచారు. 2019లో మళ్ళీ గెలిచాక వంశీ, వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. నాని మాదిరిగానే వంశీకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీని వల్ల వంశీకి చెక్ పెట్టడం టి‌డి‌పికి సాధ్యం కాదనే చెప్పొచ్చు. టి‌డి‌పి తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. ఆయన కూడా వంశీ విజయాన్ని నిలువరించడం కష్టమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: