తెలంగాణ కాంగ్రెస్ లో చీలిక ?

Veldandi Saikiran
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కొత్తవేమీ కాదు. ఎప్పుడు ఏదో ఒక వివాదం... తెరపైకి వస్తూనే ఉంటుంది. పైగా ఈ వివాదాలపై ఎవరైనా అడిగితే... తమ పార్టీ మహాసముద్ర మని... గొప్పలు చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ హనుమంతరావు గా సాగిన వర్గ పోరు.... రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక... హనుమంతరావు కాస్త చల్లబడ్డారు. అయితే... తాజాగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య వైయస్ విజయమ్మ నిర్వహించిన... ఆత్మీయ  సభ... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు రేపింది. ఈ సభకు రావాలని తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని... వైయస్ సన్నిహితులకు మరియు కాంగ్రెస్ నేతలకు వైఎస్ విజయమ్మ ఆహ్వానం పంపింది. 

ఈ నేపథ్యంలో ఈ ఆత్మీయ సభ కు... ఎవరు హాజరు కాకూడదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలామంది నేతలు ఆత్మీయ సభ కు వెళ్లలేదు. కానీ రేవంత్ రెడ్డి పై ఉన్న పాత కక్షలు నేపథ్యంలో... కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సభకు హాజరయ్యారు. హాజరు అవడమే కాకుండా... తనను ఆపే హక్కు ఎవరికీ లేదు అంటూ హెచ్చరించారు. వైయస్సార్.. కాంగ్రెస్ మనిషి... అందుకే తాను ఆత్మీయ సభకు హాజరయ్యానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో రచ్చ మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి కౌంటర్ ఇచ్చారు.

 కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీని బజారుకీడుస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేకుంటే.. సందేహం లేకుండా బయటికి వెళ్ళ వచ్చని... చురకలంటించారు మధుయాష్కి. దీంతో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఇక ఈ వివాదం పై జగ్గారెడ్డి కూడా తన స్టైల్లో స్పందించారు. అటు రేవంత్ రెడ్డిని మరియు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సపోర్ట్ చేస్తూ జగ్గారెడ్డి మాట్లాడారు. ఆత్మీయ సభకు వెళ్లడం తప్పేం కాదనీ... కోమటిరెడ్డి తన వ్యక్తిగతంగా ఆ సభకు హాజరు అయ్యారని వెనకేసుకు వచ్చారు జగ్గారెడ్డి. దీంతో కోమటి రెడ్డి వర్గం మరియు రేవంత్రెడ్డి వర్గంగా.... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చాయని... రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే... బలంగా ఉన్నటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీని కొట్టడం మామూలు విషయం కాదని చర్చ జరుగుతోంది. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  ఎప్పుడు వివాదాలు చల్ల పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: