మోడీ, కేసీఆర్, మ‌మ‌తా బెనార్జీ మ‌ధ్య‌ చీక‌టీ ఒప్పందం?

Dabbeda Mohan Babu
గ‌త కొద్ది రోజుల క్రితం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కొంత మంది ముఖ్య‌మంత్రులుతో స‌మావేశమ‌య్యారు. అందులో మొద‌ట పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనార్జీ, త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు. వీరి భేటీల త‌ర్వాత ఆయా ముఖ్య‌మంత్రులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో ములాఖ‌త్ అయ్యార‌ని చాలా మంది విమ‌ర్శించారు. కొంత మంది బీజేపీ నాయ‌కులు మాత్రం దేశ ప్ర‌ధాని ముఖ్య‌మంత్రులతో స‌మావేశం కావ‌డం తప్పుమే కాద‌ని చెప్పుక‌చ్చారు.
 
 కాని మొన్న విడిదుల అయిన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ తో వీరి మ‌ధ్య ఉన్న చీక‌టి ఒప్పందం బ‌య‌ట‌ప‌డింది. ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో సాధార‌ణ‌ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి ముఖ్య‌మంత్రి పీఠం పై కూచ్చున్న మ‌మ‌తా బెనార్జీ ఆరు నెల‌ల్లో ఖ‌చ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచితీరాలి.  త‌క్ష‌ణం ఎన్నిక‌లు నిర్వ‌హించి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్య‌మంత్రి సీటు కాపాడుకోవాల‌ని మ‌మ‌తా  బెనార్జీ ప్ర‌య‌త్నం చేసింది. దీని కోసమే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో భేటీ నిర్వ‌హించార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. అందుకే బెంగాల్ లో వేల‌ సంఖ్య‌ల్లో క‌రోనా ఉన్నా భ‌వానిపూర్‌తో పాటు మ‌రో రెండు నియెజ‌క‌వ‌ర్గాల‌ల్లో ఉప ఎన్నిక నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల కమిష‌న్ నోటిఫీకేష‌న్ విడిదుల చేసింది.

 అలాగే తెలంగాణ రాష్ట్రంలో  ఈట‌ల రాజేంద‌ర్‌ టీఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మేల్యే ప‌ద‌వికి రాజినామా చేయ‌డంతో ఆ నియోజ‌క వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక వాయిదా వేయాల‌ని ప్ర‌ధానితో నిర్వ‌హించిన భేటీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌రేంద్ర మోడీని కొరాడు. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన లిస్ట్ లో హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్ర‌స్త‌వ‌న లేదు. దీని వ‌ల్ల ఈట‌ల రాజేంద‌ర్  కు ఉన్న సానుభూతిపై ప్ర‌భావం ప‌డే అవకాశం ఉంది.  అంతే కాకుండా ఈట‌ల గెలుపు ప్ర‌శ్నార్థ‌కంగా మార‌నుంది.
ఈ వ్య‌వ‌హారాన్ని గ‌మ‌నిస్తున్న ప్ర‌జ‌లు బీజేపీ రాష్ట్ర‌ల‌ల్లో ఇత‌ర పార్టీలతో కుస్తీ చేస్తూ డిల్లీలో దోస్తీ చేస్తున్నార‌ని అంటున్నారు. నరేంద్ర మోడీ త‌మ పార్టీ కంటే ఇత‌ర పార్టీల‌కే స‌హాయం చేస్తున్న‌ట్టు ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: