కేరళలో ఏం జరుగుతుంది.. అసలు వాళ్ళు ఎలా వచ్చారు?

praveen
ప్రస్తుతం కేరళలో ఏం జరుగుతుంది. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఎప్పుడు దేశంలో ఉగ్ర కుట్రలు చేస్తు మారణ హోమాలు సృష్టించే ఉగ్రవాదుల ఆట కడుతోంది కేంద్ర ప్రభుత్వం.  సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు దేశం లోకి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఎక్కడికక్కడ మట్టు పెడుతుంది.  ఇలా ఇప్పటికే వివిధ ఆపరేషన్స్ నిర్వహించి వందల సంఖ్యలో ఉగ్రవాదులను భారత ఆర్మీ ఎన్ కౌంటర్ చేసింది అని చెప్పాలి. అయితే ఇక ఈ పోరాటంలో ఎంతో మంది భారత సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.  ఇలా భారత్లో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఉగ్రవాదులకు మరింత బలాన్ని ఇచ్చే విధంగానే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.  ప్రస్తుతం కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కానీ అక్కడ బుజ్జగింపు రాజకీయాలే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది. లైసెన్స్ లేని డబుల్ బ్యారల్ గన్స్ తో పాటు 25 రౌండ్స్ బుల్లెట్స్ తో తిరుగుతున్నట్టువంటి కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేశారు అక్కడి పోలీసులు.

 కేరళలోని తిరువనంతపురం పోలీసులు ఈ అరెస్టులు చేశారు. ఎన్ఐఏ ఇచ్చిన కీలక సమాచారంతో ఎంతో చాకచక్యంగా తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.  ఇక ఇది కాస్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రభుత్వాలు చేస్తున్న అతి బుజ్జగింపు కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అటు విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం రాష్ట్ర శాంతిభద్రతలకు మాత్రమే కాదు దేశ రక్షణకే విఘాతం కలిగించే విధంగా ఉంటుందని చెబుతున్నారు.  కేరళలో ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లయినా లేకపోవడం సిగ్గుచేటు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: