బండి సంజయ్‌కు ముందుంది ముసళ్ల పండగేనా ?

Veldandi Saikiran
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మళ్లీ దూకుడు పెంచారు. ప్రస్తుతం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాద యాత్ర నిర్వహిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద భారీ బహిరంగ సభ తో ఈ పాదయాత్ర ప్రారంభం అయింది. అక్కడినుంచి అసెంబ్లీ మీదుగా హైదరాబాద్ నగరంలోని... కీలక ఏరియాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ప్రారంభించి దాదాపు పది రోజులు పూర్తి అయింది. ఇక హైదరాబాద్ పట్టణంలో బండి సంజయ్ కుమార్ చేస్తున్న పాదయాత్రకు మంచి ఆదరణ వచ్చింది.  ఈ పాదయాత్రకు చాలామంది ప్రజలు తరలివచ్చారు. దీంతో తెలంగాణ బిజెపి పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరియు కార్యకర్తలు కొత్త ఊపు వచ్చింది.

అలాగే ఈ పాదయాత్ర సందర్భంగా  కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా... తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపింది. 2023 లో బీజేపీ పార్టీ ఇదే అధికారం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బండి సంజయ్ కుమార్. ఇది హైదరాబాదు నగరంలో... పాదయాత్ర  జరిగినప్పటి విషయం. ఇక హైదరాబాద్ నగరం వదిలి జిల్లాల్లోకి వెళుతున్నారు బండి సంజయ్ కుమార్. హైదరాబాద్ నగరంలో మంచి పట్టు ఉన్న బిజెపి.. ఈ 10 రోజుల పాదయాత్రను విజయవంతంగా కొనసాగించింది. ఇప్పుడు జిల్లాల పర్యటన ఉన్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఆ పార్టీ నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందట. హైదరాబాద్ నగరంలో లాగే ఇతర జిల్లాల్లోనూ ఇంత ఆదరణ లభిస్తుందా ? అనే ప్రశ్న నాయకులను వేధిస్తూ ఉందట.

ఒకవేళ జిల్లాల పర్యటనలో ప్రజల నుంచి మంచి ఆదరణ రాకపోతే... ఇప్పటివరకు చేసిన  ఈ పాదయాత్ర బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆవేదన చెందుతున్నారట నేతలు. నిజంగా జిల్లాల పర్యటనలోనూ ప్రజల నుంచి ఆదరణ రాకపోతే టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు... తమను టార్గెట్ చేస్తాయని భయపడుతున్నారట. హుజురాబాద్ ఉప ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో... ఈ పాదయాత్ర విఫలమైతే... బండి సంజయ్ అధ్యక్ష పదవికి ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వణికిపోతున్నారట లీడర్లు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి ఆదరణ లభించే విధంగా బిజెపి పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తుందట. ఏం చేసైనా సరే పాదయాత్రకు ప్రజలు తరలివచ్చి వ్యూహరచనలు చేస్తుందట. అయితే బీజేపీ పార్టీ వేస్తోన్న ఈ ఎత్తుగడలు.. ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: